జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న కొత్త సినిమా బాద్ షా. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అటు అభిమానులకు, ఇటు సినీ వర్గాలకు భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని తాజా సంఘటన నిరూపించింది. ఈ బాద్ షా సినిమా అమెరికా హక్కులు 4.5 కోట్ల రూపాయిలకు అమ్ముడు పోయినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఎన్టీఆర్ గత చిత్రం దమ్ము అక్కడ 2.5 కోట్ల రూపాయిలకు అమ్ముడు పోగా, ఇప్పుడు అతని తాజా సినిమా అంతకు రెట్టింపు రేటుకు అమ్ముడు పోవడం విశేషం.  ఈ బాద్ షా సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను బండ్ల గణేష్ నిర్మిస్తుండగా, సంగీతం తమన్ అందిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: