టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రభాస్ అభిమానులతో మాటల యుద్ధానికి దిగాడు. రాజమౌళి హాట్ కామెంట్స్ ప్రభాస్ వీరాభిమానులు జీర్ణించు కోలేక మదన పడుతున్నారని టాక్. ‘బాహుబలి’ విడుదలై రేపటితో 50 రోజులు పూర్తి అవుతున్న సందర్భంలో టాలీవుడ్ సినిమా రికార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు తన ట్విట్టర్ లో చేసాడు రాజమౌళి. అయితే ఈ వ్యాఖ్యలు తమను టార్గెట్ చేసేవిగా ఉండటం ప్రభాస్ అబిమానులకు తల నొప్పిగా మారిందని వార్తలు వస్తున్నాయి.
 

ఒక  సినిమా 50, 100, 175 రోజులు ఆడిందనే గొప్పలు చెప్పుకునే కాలం పోయింది అంటూ ప్రస్తుతం ఎంత భారీ సినిమా అయినా 1000 థియేటర్స్‌లో రిలీజై మూడునాలుగు వారాలకు ఆ సినిమా కలెక్షన్స్ హవా తగ్గిపోతున్న నేపధ్యంలో ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా అది 100 రోజులు ఎక్కువ సెంటర్స్ ఎలా ఆడుతుంది అంటూ ప్రభాస్ అభిమానులకు ఎదురు ప్రశ్నలు వేసాడు రాజమౌళి. రాజమౌళి ఇలా స్పందించడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు.

‘బాహుబలి’ సినిమాను కొన్నిఊళ్ళ నుండి ఎల్లుండి నుంచి తీసివేస్తున్న నేపధ్యంలో ప్రభాస్ అభిమానులు తమ ప్రాంతాలనుండి బహుబలిని తీసివేయ వద్దని రాజమౌళి పై ఒత్తిడి చేయడమే కాకుండా అవసరం అనుకుంటే తమ స్వత డబ్బులతో బాహుబలి సినిమా టికెట్స్ కొని ఈసినిమాను 100 రోజుల అత్యధిక థియేటర్స్  రికార్డుకు చేరే విధంగా కృషి చేస్తామని ప్రభాస్ అభిమానులు రాజమౌళి దగ్గర సూచించినట్లు టాక్. దీనితో రాజమౌళి రికార్డుల కోసం థియేటర్స్‌ని బ్లాక్ చేసి సినిమాలను ఆడించే కల్చర్ మంచిది కాదని ఇటువంటి ఫాల్స్ రికార్డులకు బ్రేక్ వేయాలని తన ట్విట్టర్ లో షాకింగ్ కామెంట్స్ చేసాడు.  

‘బాహుబలి’ కి ప్రేక్షకులు టాలీవుడ్ చరిత్రను తిరగరాసే ఘన విజయాన్ని అందించారనిఅంటూ ఈవిజయం తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అంటూ ఇలాంటి ఫాల్స్ రికార్డుల వల్ల ఏమీ ఒరగదని తెలిపాడు జక్కన్న. ‘బాహుబలి’ ప్రస్తుతానికి కొన్ని మెయిన్ థియేటర్స్‌ లో మంచి కలెక్షన్స్ ఇస్తోందని అయితే  చాలాచోట్ల థియేటర్స్‌లో ఈ సినిమా కలెక్షన్స్ తగ్గిన నేపధ్యంలో ఇంకా ‘బాహుబలి’ ని రన్ చేయాలని ఫ్యాన్స్ కోరడం దురదృష్టకరo అంటున్నాడు రాజమౌళి.  ఈ విషయంలో మరొక ట్విస్ట్ ఏమిటంటే రాజమౌళి మాటలకు వివాదాల రామ్ గోపాల్ వర్మ కూడ మద్దతు తెలుపుతూ ట్విట్ చేయడం మరింత సంచలనంగా మారింది. ఏది ఎలా ఉన్నా రాజమౌళి వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులు జీర్ణించుకోలేక  పోతున్నారని టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: