వరుస ఫ్లాప్ లతో టాలీవుడ్ టాప్ ఫ్లాప్ హీరోగా రికార్డులు  క్రియేట్ చేసిన వరుణ్ సందేష్  రమ్య  కృష్ణతో చేయబోతున్న సంచలనం ప్రస్తుతం టాపిక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది.  మోహన్ బాబు అల్లరి నరేష్ తో కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాలో వరుణ్ సందేశ్ రమ్యకృష్ణకు కొడుకుగా నటించ బోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. 

నాగార్జునతో ‘ఢమరుకం’ తీసిన శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఈసినిమా నిర్మింపబడుతోంది. ఇప్పటికే  షూటింగ్ ప్రారంభం అయిన ఈసినిమా షూటింగ్ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో చాలవేగంగా జరుగుతోంది. గతంలో మోహన్ బాబు  నిర్మించిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో నటించాడు వరుణ్ సందేశ్. 

ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ కాబోతోంది మోహన్ బాబుకు భార్యలుగా మీనా, రమ్యకృష్ణ నటిస్తున్న ఈసినిమాలో 25 సంవత్సరాల క్రితం వచ్చిన మోహన్ బాబు ‘అల్లరి ప్రియుడు’ కాంబినేషన్ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ నిర్మిస్తున్న సినిమా ఇది.  రమ్యకృష్ణ కొడుకుగా వరుణ్ సందేశ్ నటిస్తూ ఉంటే అల్లుడిగా అల్లరి నరేష్, కూతురుగా పూర్ణ చేస్తున్నారు. 

ఇప్పటికి ఈ సినిమాలో మోహన్ బాబు మీద ఒక పాట పెట్టాలని డిసైడ్ అయ్యారట. అయితే ఆపాట మీనాతోనా, రమ్యకృష్ణతోనా లేక ఇద్దరితోనా అన్న విషయంపై క్లారిటీ లేదు. మోహన్ బాబు మార్క్ కామెడీతో పక్కా కామెడీ సినిమాగా మంచు విష్ణు తీస్తున్న ఈసినిమా పై మోహన్ బాబు చాల ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం రమ్య కృష్ణ క్రేజ్ తార స్థాయిలో ఉంది  కాబట్టి ఆమె క్రేజ్ వరుణ్ దేశ్ కు ఏమైనా టర్నింగ్ పాయింట్ గా మారుతుందేమో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: