రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో కాలభైరవ పాత్రకు కిరికిరీ భాషను సృష్టిస్తే నిన్న విడుదలైన అఖిల్  సినిమా ఫస్ట్ లుక్ లోని ‘పవర్ ఆఫ్ జుఅ’  అనే ట్యాగ్ వెనుక స్వాహిలి భాష ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ‘జుఅ’ అనే పదం ఇంగ్లీష్ భాషకు సంబంధించి కాని మన దేశంలోని ఇతర భాషలకి సంబంధించింది కాదు. 

తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆఫ్రికాలోని ప్రజలు చాలామంది మాట్లాడుకునే స్వాహిలి భాషలో ‘జుఅ’ అంటే సూర్యుడు అని అర్ధం. ఆఫ్రికా ఖండంలోని ఉగాండా, టాంజానియా, కెన్యా, కాంగో దేశాలలో ఈ భాషను చాలా మాట్లాడుతారు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా ఒక ఫ్యాంటసీ కథాంశంతో రూపొందుతోంది. 

ఆఫ్రికాలోని కొందరు ఆటవికులు సూర్యుడుని దేవుడిగా ఆరాధిస్తారు కాబట్టి ఈ స్వాహిలి పదంతో ‘ది పవర్ ఆఫ్ జుఅ’ అన్న మాటలను అఖిల్ ఫస్ట్ లుక్ కు వాడారు అని టాక్. ఈవార్తలు ఇలా ఉండగా నిన్న విడుదలైన అఖిల్ ఫస్ట్ లుక్ కు విపరీతమైన స్పందన వస్తోంది. ఈసినిమా తొలి పోస్టర్ లోనే అఖిల్ ను అద్భుతంగా చూపెట్టారు అంటూ అక్కినేని అభిమానులు మురిసిపోతున్నట్లు టాక్. 

చేతిలో ఒక ఫైర్ బాల్ తో కనిపిస్తున్న అఖిల్ మొట్టమొదటి సినిమాతోనే మాస్ హీరోగా నిలబడి పోవడం ఖాయం అని అభిమానులే కాకుండా అన్ని వర్గాల వారు కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద అఖిల్ నిన్నటి తన ఫస్ట్ లుక్ పరీక్షలో చాల మంచి మార్కులతో బయటపడినట్లు అర్ధం అవుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: