బాహుబలి లాంటి మూవీ ఎటువంటి సక్సెస్ ని సాధించిందో అందరికి తెలిసిందే. అలాగే ఇండియన్ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లేదనేది కూడ అందరి తెలుసు. ఇండియన్ సినిమాలు ఆస్కార్ రేంజ్ కి వెళ్ళాలనేది ప్రతి భారతీయుడు కోరిక. తాజాగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు ఇండియ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ గ్రాండ్ సక్సెస్ ని సాధించిన తెలుగు సినిమా బాహుబలి. ఈ మూవీని అస్కార్ బరిలో నిలపటానికి ప్రాసెస్ నడుస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఈ ఏడాది ఇండియన్‌ బాక్స్‌ ఆఫీస్‌ను షేక్‌ చేసింది.

తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. టాలీవుడ్‌లో చేసిన అది పెద్ద పీరియాడికల్‌ సినిమా కూడా ఇదే. ఈ చిత్రం ఇప్పుడు సరికొత్త రికార్డును సృష్టించబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్‌ రేస్‌లో ఉంది. ప్రముఖ దర్శకుడు అమోల్‌ పాలేకర్‌ నేతృత్వంలో ఆస్కార్‌ ఎంపిక జరుగుతుంది. వారు భారత్‌ తరఫున ఆస్కార్‌ అకాడమీ అవార్డుల నామినేషన్స్‌కి పంపాల్సిన 45 సినిమాలను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఆస్కార్‌కు నామినేట్‌ చేయాలని మన తెలుగు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వారు టాలీవుడ్‌ నుంచి 'బాహుబలి'ని అధికారిక ఎంట్రీగా అస్కార్‌ ప్యానల్‌కు పంపారు.

ఆస్కార్‌ ప్యానల్‌ కూడా 'బాహుబలి' సినిమాను ఆస్కార్‌ నామినేషన్స్‌కి పంపించడానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు. ఈ ఏడాది ఆస్కార్‌కు వెళుతున్న బాలీవుడ్‌ సినిమాలు అమీర్‌ ఖాన్‌ చిత్రం 'పికె',అనురాగ్‌ కశ్యప్‌ సినిమా 'అగ్లీ', విశాల్‌ భరద్వాజ్‌ ' హైదర్‌', ప్రియాంకా చోప్రా ' మారీ కామ్‌'. ఈ చిత్రాల జాబితాలో మన 'బాహుబలి' సినిమా కూడా పోటీ పడుతుంది.

కె.విశ్వనాథ్‌ -కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ' స్వాతి ముత్యం' చిత్రం తర్వాత తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఆస్కార్‌కు వెళ్లనున్న మరొక సినిమా 'బాహుబలి' కావడం విశేషం.ఈ సందర్భంగా కేరళలో నిర్వహించే ఓనం ఉత్సవాల్లో భాగంగా'బాహుబలి' చిత్రంలో ఒక సన్నివేశాన్ని వివిధ పూలతో అలకరించారు. రమ్యకృష్ణ బాహుబలిని శత్రువుల నుంచి కాపాడే క్రమంలో ఆమె చనిపోతూ బిడ్డను చేతితో పైకి ఎత్తి ఉన్న సన్నివేశాన్ని పూలతో అలంకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: