టాలీవుడ్ లో ఓ వండర్ క్రియేట్ చేసి, దానిని ప్రపంచానికి చూపించిన టాప్ డైరెక్టర్ రాజమౌళి, తాజాగా ఓ సన్షేనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. జూలై 10న టాలీవుడ్ లో రిలీజ్ అయిన అద్భుతమైన విజువల్ వండర్ ‘బాహుబలి’. 

మన కళ్ళని రెప్ప వేయనీకుండా చేసే భారీ సెట్స్, ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని భారీ విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్, ఇవన్నీ చూస్తూ కూడా మనం చూస్తున్నది తెలుగు సినిమానేనా అని ఒకింత ఆశ్చర్యం, ఒకింత గర్వంగా ఫీలయ్యే అనుభవాన్ని కలిగించిన ‘బాహుబలి’ సినిమా రిలీజ్ అది.

ఇదిలా ఉంటే బాహుబలి, అలాగే ఇతర మూవీలను రికార్డ్స్ లతో ఎక్కడా పోల్చకుడదు. గత రోజుల్లాగా ఇప్పుటి సినిమాల పరిస్థితి లేదు. రిలీజ్ చేసిన 3,4 వారాల్లోనే బిజినెస్ క్లోజ్ అవుతుంది. గొప్పల కోసం థియోటర్స్ లో ఆడించొద్దు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం బాహుబలి మూవీ కొన్ని థియోటర్స్ లో 100 రోజులు, మరికొన్ని థియోటర్స్ లో సంవత్సరం పాటు ఆడించటానికి ఫ్యాన్స్ రంగం సిద్ధం చేసుకున్నారు. రాజమౌళి కామెంట్స్ బాధపడిన ఫ్యాన్స్, రాజమౌళికి గట్టిగానే సమాధానం చెప్పారు.

అభిమానం ఉంటే ఎంత వరకైనా చేస్తాం. అయితే పాత రోజుల్లాగా ఇంట్లో వస్తువులు అమ్ముకొని సినిమాలను ఆడించం. ఉన్నంతలో సర్ధుకుపోతాం. అలాగే మా హీరో నుండి వచ్చిన నిజమైన సక్సెస్ ని ఆ సంవత్సరం మొత్తం పండుగ చేసేలా ప్లాన్ చేసుకుంటాం. రికార్డ్ లు లేని ఇండస్ట్రీ ఎక్కడా లేదు. మరోసారి ఫ్యాన్స్ పై అటువంటి కామెంట్స్ చేయకండి..అంటూ ఈస్ట్, వెస్ట్ నుండి రాజమౌళికి గట్టిగానే కామెంట్స్ వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: