ఒకప్పుడు చిరంజీవ రాజకీయాల్లోకి వస్తే, ప్రజా రాజ్యం పార్టి ఆవిర్భావ సభకి వచ్చిన జనసందోహాన్ని చూసి రాజకీయ నేతలకు వణుకు తెప్పించింది. అయితే, అధికారాన్ని అస్తగతం చేసుకునేంతగా ఫలితాలు రాలేదు. అలాగే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పార్టి తరుపున ఫైట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ లోనూ ఎక్కడా నిజాయితీ లేదు.

అలా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది అంటూ నాగాబాబు చెప్పుకొచ్చాడు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ తాజాగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే, బర్త్ డే రోజున నాగబాబు సీరియస్ పైనా పవన్ తీవ్రంగా ఆలోచించాడు. తన వెంట వచ్చేది నిజమైన ఫ్యాన్సేనా? లేక అల్లరి చేసే అల్లరి మూకా? అంటూ లెక్కలు కట్టే పనిలో ఉంది జనసేన పార్టీ కమిటీ.

ఇక నుండి అల్లరి మూక ఆటలు అరికట్టేలా పవన్ ఫ్యాన్స్ ఓ కమిటీని ఏర్పాటు చేసుకుంటుంది. భవిష్యత్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ సభల్లోనూ, అలాగే మెగా ఫంక్షన్స్ లోనూ పవన్ కళ్యాణ్ అంటూ అల్లరి చేసే వారిని ఈ కమిటీ ఓ కంట గమనిస్తూ ఉంటుంది. ఎవరైన కావాలని అల్లరి చేస్తే వెంటనే అతడిని అక్కడిక్కడి విచారించి, వివరాలను సేకరిస్తుంది. వివరాలు తప్పని తెలిస్తే, తనని వెంటనే అక్కడి నుండి పంపించి వేయటంతో పాటు, తన వివరాలను మెగా ఫ్యాన్స్ అలాగే పవన్ ఫ్యాన్స్ కి షేర్ చేయటం జరుగుతుందట.

ఇదిలా ఉంటే ఇక నుండి పవన్ కళ్యాణ్ రాజకీయంగా చేపట్టే కార్యక్రమాలకు కొంత మంది పవన్ ఫ్యాన్స్ నిత్యం తోడుగా ఉండబోతున్నారు. ఇక నుండి ఏ పనైనా రెండు రాష్ట్రాలలోనూ వారే చేపట్టనున్నారంట. మొత్తంగా నిజాయితీగా ఉంటే ఫ్యాన్స్ కి ఈ తరహా పనులు ఎంతో సంతోషాన్ని ఇచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: