టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ఊహించని అదృష్టాన్ని కలిగించి సంచలనాలు   సృస్టిస్తున్న ‘శ్రీమంతుడు’ కు సీక్వెల్ గా మంచు విష్ణు మారబోతున్నాడు. ‘శ్రీమంతుడు’ మూవీలో హీరో మహేష్ గ్రామాలను దత్తత తీసుకోవడం మంచు వారి హీరో మంచు విష్ణును కూడ ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. దీనితో మహేష్ బాటనే అనుసరిస్తున్నాడు మంచు వారి అబ్బాయి. 

మహేష్ శ్రీమంతుడి ప్రభావంతో రెండు గ్రామాలను దత్తత తీసుకుంటే అందరికీ షాక్ ఇస్తూ విష్ణు  తన సొంత జిల్లా చిత్తూరుజిల్లాలో 10 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించి మహేష్ కు షాక్ ఇచ్చాడు. అయితే మంచు విష్ణు తీసుకున్న ఈనిర్ణయం వెనుక కుడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. 

ఈమధ్య మహారాష్ట్రకు చెందిన మంచు విష్ణు సన్నిహిత మిత్రుడు తపన్ పటేల్ అనే వ్యక్తి విష్ణును కలవడమే కాకుండా మహారాష్ట్రలోని షిర్‌పూర్ గ్రామాన్నితానూ తన బంధువులు దత్తత తీసుకుని అభివృద్ది చేసిన విషయాన్ని విష్ణు దృష్టికి తీసుకు వచ్చాడట. ఈ విషయం తన మిత్రుడు ద్వారా తెలుసుకుని ఆ గ్రామానికి వెళ్ళిన విష్ణు అక్కడి పరిస్థితులు చూసి ఆశ్చర్య పోయాడట. దీనికికారణo నిన్న మొన్నటి వరకు నిన్నమొన్నటివరకు మంచినీటి కొరతతో అల్లాడిన ఆగ్రామం ఇప్పుడు పుష్కలంగా నీటి సమృద్దితో కళకళలాడుతోందట. వాటర్ హార్వెస్టింగ్‌తో నీళ్ళ కొరత లేకుండాఉన్న ఆ గ్రామా పరిస్థుతులను చూస్తే తనకు ఆశ్చర్యం కలిగింది అంటున్నాడు.

 ఆ పరిస్థుతులను చూశాక తాను కూడా చిత్తూరు జిల్లాలో ఇలాగే 10 గ్రామాల అభివృద్ధికి పాటుపడతానని అంటున్నాడు మంచువారి అబ్బాయి.  తాను దత్తత తీసుకోనబోయే గ్రామాలలో వాటర్ హార్వెస్టింగ్ కోసం 70 నుంచి 80 లక్షలు ఖర్చవుతుందని ఆ   డబ్బు  అంతా  తనే భరించి  ఖర్చు పెడతాను అని ప్రకటించాడు విష్ణు. ‘శ్రీమంతుడు’ ఘన విజయం సాధించడమే కాకుండా ఆ సినిమా ప్రభావం సెలిబ్రేటీల నుండి సమాన్యుల పై కుడా చూపెట్టడం మహేష్ తన జీవితంలో సాధించిన ఘన విజయం అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: