అలియా భట్ కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న ఈ అమ్మడు యూత్ ఐకాన్ గా పాపులర్ అయ్యింది. ఎవరూ ఊహించని విధంగా రేసులో దూసుకుపోతూ తన సత్తా చాటుతుంది ఈ అమ్మడు. కుర్ర హీరోల సరసన వరుస అవకాశాలతో పాటు సక్సెస్ లను కూడా అందుకుంటున్న ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు ఏకంగా బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశం దక్కించుకోవడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు.

 

అయితే ఈ సీనియర్ హీరోతో అలియా రొమాన్స్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారా అనేదే ఇప్పుడు సందేహంగా మారింది. కానీ ఈ సినిమా స్టోరీ సరికొత్తగా ఉంటుందని సమాచారం. ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా దర్శకురాలు గౌరీ షిండే తెరకెక్కించబోయే 'ఎ హట్కే లవ్ స్టోరీ' లో షారుఖ్ సరసన అలియా రొమాన్స్ చేయనుందట.

  

షాందర్ సినిమాలో అలియా భట్ :

  

ఈ కథ విషయానికొస్తే ఇరవై ఏళ్ల అమ్మాయి ముగ్గురు వేర్వేరు వయసులో ఉన్న మగాళ్లతో డేటింగ్ చేయడమనే అంశంతో రూపొందనుందట. ఈ ముగ్గురిలో కింగ్ ఖాన్ 50 ఏళ్ల వ్యక్తిగా కనిపించనున్నాడట. దీంతో అలియా షారుఖ్ తో కలిసి రొమాన్స్ లో రెచ్చిపోవడం ఖాయమంటున్నారు బీ టౌన్ బాబులు. ఏదేమైనా అలియా ఊహించిన బంపర్ ఆఫర్ అందుకుంది.

 

సినిమాలో ఒక్క హీరో ఉంటేనే రెచ్చిపోయే అలియా ఏకంగా ఒకేసినిమాలో ముగ్గురితో రొమాన్స్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. ఈ న్యూస్ వచ్చినప్పటి నుండి సినిమా ఎప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు బాలివుడ్ ఆడియెన్స్. ప్రస్తుతం షాందర్ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఈ అమ్మడు షారుక్ తో ఏ విధంగా రొమాన్స్ చేయనుందో అని అటు ప్రేక్షకులతో పాటు బాలివుడ్ సిని ప్రముఖులు కూడా వెయిట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: