బాహుబలి 50డేస్‌ కంప్లీట్ అయిన సందర్భంగా రాజమౌళి ట్వట్టర్‌ ఫేస్‌బుక్‌లలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.జులై 10న గ్రాండ్‌గా రిలీజ్ అయిన బాహుబలి దేశవ్యాప్తంగా రికార్డ్‌ కలెక్షన్లు రాబట్టింది.తెలుగు సినిమా దశ దిశా మార్చివేసింది.టాలీవుడ్‌ సత్తా తెలియజేసింది.మంచి సినిమాలు చేస్తే మార్కెట్‌ ఎలా ఉంటుందో మన హీరోలకు,డైరెక్టర్స్‌కు చెప్పకనే చెప్పింది.ఒక విధంగా చెప్పాలంటే సినిమాను ఎలా ప్రమోషన్‌ చేసుకోవాలో కూడా టాలీవుడ్‌కు తెలియజేసింది.దీనిపై రాజమౌళి ట్విట్టర్‌లో స్పందించాడు.   హీరోలతోనే కాదు ఈగతో కూడా ఫైట్స్ చేయించే సత్తాగల దర్శకుడు రాజమౌళి బాహుబలి గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. బాహుబలి సినిమాను బలవంతంగా ఆడించొద్దంటూ విజ్ఞప్తి చేశాడు.   ఇప్పుడు సినిమాలు వేల థియేటర్లలో విడుదలవుతున్నాయి 3-4 వారాలు ఆడితే గొప్ప అంటూ చెప్పుకొచ్చాడు.

ఃకొన్ని చోట్లనుండి షేర్‌లు వస్తున్నా చాలా వరకు బాహుబలి పరుగు అయిపోయినట్టే అంటూ తేల్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు అభిమానులు బాహుబలిని బలవంతంగా ఆడించాలనడం బాధాకరం, మరి కొంతమంది తమ జేబుల్లోంచి డబ్బులు పెట్టి ఆడించాలనుకోవడం సరికాదు అంటూ హితబోద చేశాడు. ఎన్నో రోజులనుండి సినిమా ఇండస్ట్రీ ఈ సమస్యతోనే బాధపడుతుంది.   బాహుబలి సినిమాను కూడా రికార్డ్ ల కోసం బలవంతంగా ఏ ఒక్క థియేటర్ లో కూడా కొనసాగించబోమని చెప్పాడు. కలెక్షన్లు లేకపోయినా సినిమాను థియేటర్లలో ఉంచటం వల్ల అదే సమయంలో రిలీజ్ అయ్యే చిన్న సినిమాలకు థియేటర్ల కొరత ఏర్పడుతుందని, అందుకే ఎవరూ అలాంటి ఫేక్ రికార్డ్స్ కోసం ప్రయత్నించొద్దని సలహా ఇచ్చారు.

బాహుబలి పోస్టర్


ప్రభాస్, రానాలు లీడ్ రోల్స్ లో తెరకెక్కిన బాహుబలి జూలై 10 న రిలీజ్ అయి ఇప్పటికీ మంచి వసూళ్లను రాబడుతుంది. ఈ విజువల్ వండర్ 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సౌత్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది.భాగస్వామ్యులం కావద్దు. ఇలాంటి సంస్కృతికి చెరమగీతం పాడాలి, బాహుబలి షేర్‌లు రాబట్టినన్నిరోజులు ఆడుతుంది. ఇక సినిమా ఆడే పరిస్థితి లేకపోతే కొత్త సినిమాలకు దారినివ్వాల్సిందే అంటూ చెప్పాడు. అబద్దపు రికార్డుల కోసం థియేటర్లను బ్లాక్ చేయడం సరికాదంటూ సెలవిచ్చాడు. నిజంగా రాజమౌళి పెద్ద చిత్రాలను రూపొందించడమే కాదు పెద్ద మనసున్న వ్యక్తంటూ సినీ జనాలు పొగడ్తల జల్లులు కురిపిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: