మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ గోవింధుడు అందరివాడేలే సినిమా తర్వాత చాల గ్యాప్ తీసుకొని శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ సినిమా టైటిల్ విషయలో తర్జన భర్జనలు జరిగాయి విజేత,మైనేమ్ ఈజ్ రాజ్,బ్రూస్ లీ లాంటి టైటిల్స్ పరిశీలనలోకి రాగా  ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. కాగా మొన్నామద్య చిరంజీవి 60వ పుట్టిన రోజు వేడుకలకు ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. చెర్రీ చెతిపై బ్రూస్ లీ టాటూతో కనిపించాడు.

తాజాగా వరలక్ష్మీ కటాక్షంతో ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘ది ఫైటర్’ అనే ట్యాగ్ లైన్ కలిగిన ఈ చిత్రంలో చెర్రీ పవర్ఫుల్ ఫైటర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఆ టీజర్ లోని చెర్రీ చెప్పే డైలాగ్ ‘నీ మీటర్ పగిలితేగానీ, నా మీటర్ అర్థంకాదు’ సూపర్బ్ గా వుందంటూ చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు. ఇందులో చెర్రీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తొలిసారి జతకడుతోంది.

థమన్ ఎస్.ఎస్. సంగీతాన్ని అందించిన ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది.కోన వెంకట్ తో విడిపోయిన అనంతరం శ్రీను తీసిన చిత్రాలు అంతగా విజయం సాధించని నేపథ్యంలో.. మంచి హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో అతనితో మళ్లీ జతకలిశాడు. ఇక ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం యావరేజ్ హిట్ కావడంతో.. ఈ ‘బ్రూస్ లీ’ చిత్రం ఘన విజయం సాధిస్తుందని చెర్రీ నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: