ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పల్లె టూర్లను దత్తకి తీసుకునే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఇదొక ట్రెండ్ గా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహిస్తున్నాయి. ఇదే సమయంలో సొంతూరిని దత్తత తీసుకోవాలనే కాన్సెప్టుతో వచ్చి విజయం సాధించింది మహేష్ బాబు ‘శ్రీమంతుడు' మూవీ.

మహేష్ బాబు ఇప్పటికే తన నేటివ్ విలేజ్ బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. అలాగే యంగ్ హీరోలు సైతం గ్రామాలను దత్తతకి తీసుకోవటానికి ముందుకు వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు కూడా తన సొంత చిత్తూరులో జిల్లాలో 10 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ విషయంపై మంచు విష్ణు వివరాలను చెప్పుకున్నాడు, చిత్రూరు జిల్లా చంద్రగిరి మండలంలో10 గ్రామాలను దత్తత తీసుకున్నాను.

అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనేదిపై ప్లాన్ చేస్తున్నట్లు, త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. గ్రామాల్లో తాగునీరు,విద్య లాంటి అవసరాలపై మంచు విష్ణు ముందుగా దృష్టి సారించనున్నారు. గవర్నమెంటు స్కూల్స్ లో టాయిలెట్స్ నిర్మాణానికి ఇప్పటికే చర్యలు చేపట్టారు.

త్వరలోనే ఆయన ఏపీ సీఎం చంద్రబాబును కలిసి గ్రామాల అభివృద్ది విషయంలో తన విజన్ గురించి మాట్లాడనున్నారు. మంచు విష్ణు గ్రామాలను దత్తత తీసుకోవడంపై ఆయన సోదరుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... మై బ్రదర్ విష్ణు 10 గ్రామాలను దత్తత తీసుకున్నారని చెప్పడానికి గర్వ పడుతున్నాను. గుడ్ లక్ అన్నా అంటూ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: