పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా నితిన్ ఇప్పటి వరకు అనేక సందర్భాలలో తన అభిమానాన్ని బహిరంగంగా వ్యక్త పరిచిన సంఘటనలు ఎన్నో జరిగాయి. అయితే నితిన్ అఖిల్ ను హీరోగా  చేసి నిర్మిస్తున్న ‘అఖిల్’ సినిమా తొలి టీజర్ ను విడుదల చేసే విషయంలో నిన్న ఫిలింనగర్ లో హడావిడి చేసిన గాసిప్పులకు ఈరోజు వాస్తవంగా జరుగుతున్న విషయాలకు కొద్దిగా తేడా రావడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. 

అఖిల్ ఫస్ట్ లుక్ విడుదల తరువాత ఈ సినిమా టీజర్ ను నితిన్ పవన్ చేత ఈరోజు విడుదల చేయిస్తాడు అంటూ కొంతమంది వార్తలు సృష్టించారు. నితిన్ కు పవన్ పట్ల ఉండే సెంటిమెంట్ తో ఇలా జరగబోతోంది అంటూ గాసిప్పులు హడావిడి చేసాయి. అయితే ముందుగా అనుకున్నట్లుగా ఈరోజు ఉదయం 10 గంటల 30 నిముషాలకు కాకుండా సాయంత్రం 6 గంటల 30 నిముషాలకు ‘అఖిల్’ సినిమా టీజర్ విడుదల అవుతోంది. 

అయితే ఈ కార్యక్రమానికి అతిధిగా సల్మాన్ ఖాన్బ్ వస్తున్నాడు. ఈ సినిమా యూనిట్ తో పాటు సల్మాన్, నాగార్జునలు పాల్గొనే ఈ టీజర్ విడుదల ఈరోజు హడావిడిగానే చేస్తున్నారు.  అయితే  అఖిల్ టీజర్ లాంచింగ్ విషయంలో నితిన్ తన సెంటిమెంట్ ను కూడ బ్రేక్ చేసుకుని సల్మాన్ ఖాన్ వైపు వెళ్ళడం వెనుక ఒక ఎత్తుగడ ఉంది అని అంటున్నారు. 

బాలీవుడ్ లో కూడ అఖిల్ కు మంచి క్రేజ్ ఏర్పరచడానికి ఈ ఎత్తుగడ వేసారు అని టాక్. ఏది ఏమైనా ఈసారి నితిన్ పవన్ సెంటిమెంట్ ను దాటి వెళ్ళిపోయాడు అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: