‘శ్రీమంతుడు’ ఘన విజయంతో కొరటాల శివ నామస్మరణతో టాలీవుడ్ హోరెత్తి పోతోంది. గతంలో మెగా కాంపౌండ్ లో రామ్ చరణ్ వల్ల కొరటాల అవమానాన్ని పొందాడు అని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అటువంటి కొరటాల మాయకు నేడు ఏకంగా చిరంజీవి ఆకర్షింప బడటమే కాకుండా తనతో ఒక సినిమా చేయమని మెగా స్టార్ వరస పెట్టి సందేశాలు పంపుతున్న వార్తలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.  

‘శ్రీమంతుడు’ లా మెసేజ్ తో పాటు మాస్ ఎంటర్ టైన్ మెంట్ ను లింక్ చేసి ఒక సినిమాను తనకు చేసి పెట్టమని చిరంజీవి కొరటాలకు ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. ఈ వార్తలు ఇలా ఉంటే ప్రస్తుతం సుకుమార్ తో లండన్ లో సినిమాను చేస్తున్న జూనియర్ తన షూటింగ్ ను బ్రేక్ చేసుకుని కొద్ది రోజులు హైదరాబాద్ కు రావడమే కాకుండా కొరటాల ఇంటికి వెళ్ళి అతడిని అభినందించి తనతో ఒక సినిమా చేసేలా ఒప్పించి మళ్ళీ లండన్ వెళ్ళిపోయాడు అనే వార్తలు కూడ ఇప్పటికే వచ్చాయి. 

ఇదిలా వుంటే మoచి కథ రెడీ చేస్తే, పవన్ కళ్యాణ్ తో ప్రెస్టీజియస్ గా వంద కోట్ల సినిమా చేద్దామని కొరటాలతో అంటున్నాడట దిల్ రాజు. ఇది చాలదు అన్నట్లుగా ఇప్పటికే అక్కినేని కుటుంబాన్ని లైన్ లో పెట్టి అఖిల్ రెండవ సినిమాను తీయడానికి ప్రయత్నిస్తున్న బండ్ల గణేష్ అఖిల్ కోసం ఒక కథను తయారు చేస్తే ఇప్పటి వరకు ఎవ్వరూ ఇవ్వని భారీ పారితోషికం ఇస్తానని కొరటాలను బండ్ల గణేష్ మాయ చేస్తున్నట్లు కూడ వార్తల హడావిడి వినపడుతోంది. 

మరో పక్క అల్లుఅర్జున్ కూడ నిర్మాత దానయ్య సినిమాలో నటించే సినిమా విషయంలో తనకు కొరటాల కావాలి అని అడుగుతున్నట్లు టాక్. ఈవిధంగా నేడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కొరటాల నామస్మరణే. ఈ ఒత్తిడి తట్టుకోలేక కాబోలు కొరటాల వీటన్నింటికి దూరంగా ప్రస్తుతం ఫోనుకు కూడ అందుబాటలో లేకుండా అమెరికాలోని తన సన్నిహితుల ఇంటిలో రెండు వారాలు రెస్ట్ తీసుకుంటున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: