వరుసగా బ్లాక్ బస్టర్ మూవీలను అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టార్ హీరోల మూవీలను వదిలేసి యంగ్ హీరోలతో మూవీలను మొదలు పెట్టిన తరువాత నుండి..తనపై సెటైర్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ మాత్రం ఆగటం లేదు. గతంలో పెద్ద హీరోలతో వరుస బ్లాక్ బస్టర్ అందుకుంటుంటే, చిన్న హీరోలతో సినిమాలను తీసి..సక్సెస్ కొట్టమను చూద్ధాం..అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ లో టాక్స్ వినిపించాయి. ఇప్పుడు ఓ రేంజ్ హీరోలతో సినమాను స్టార్ట్ ఛేసిన తరువాత, ఇక త్రివిక్రమ్ కి ఇప్పట్లో పెద్ హీరోలు డేట్స్ ఇచ్చేలా లేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఏడాది ‘S/O సత్యమూర్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ త్వరలోనే యంగ్ హీరో నితిన్ తో చేయనున్న సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా జరుగుతోంది. నితిన్ మూవీకి హైప్ క్రియేట్ చేయటం కోసం త్రివిక్రమ్ అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.

ముందుగా ఈ సినిమా కోసం మణిరత్నం దగ్గర పనిచేసిన రాజీవ్ మీనన్ ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకోవాలని అనుకున్నారు కానీ తాజాగా ఆ అవకాశం వేరొకరికి దక్కింది. తమిళంతో పాటు హిందీలో కూడా పలు సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన నటరాజన్ సుబ్రమనియంని త్రివిక్రమ్ – నితిన్ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ఎన్నికయ్యాడు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా సమంతని ఫైనలైజ్ చేయగా రెండవ హీరోయిన్ కోసం అన్వేషణ చేస్తున్నారు.

అలాగే తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇలా మొత్తంగా నితిన్ సినిమాకి హైప్ క్రియేట్ చేసుకునే బాధ్యత త్రివిక్రమ్ పై పడింది. అదే టాప్ హీరోతో మూవీ అయితే, త్రివిక్రమ్ ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదంటూ సెటైర్స్ వేస్తున్నారు. ఇదిలా ఉంటే నితిన్ మూవీ తరువాత మహేష్ డేట్స్ దొరుకుతాయి అనుకున్న త్రివిక్రమ్ కి, ఇప్పట్లో దొరికేలా లేవు. దీంతో కొంత కాలం చిన్న హీరోలతోనే త్రివిక్రమ్ సరిపెట్టుకోవాల్సి ఉంటుందనేది ఇండస్ట్రీ టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: