భారీ అంచనాలతో రిలీజ్ అయిన కిక్2 మూవీ బాక్సాపీస్ వద్ద సాధారణ కలెక్షన్స్ తో నడుస్తుందనే టాక్ ట్రేడ్ రిపోర్ట్స్ తెలుస్తుంది.రవితేజ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కిక్‌-2'.నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మించారు. మొదటగా ఈ మూవీ సెకండాఫ్ బోర్ కొట్టడంతో, ఎంటర్టైన్మెంట్ తక్కువైందని కంప్లైంట్ లు వచ్చాయి.

దాంతో ఈ చిత్రంకు నెగిటివ్ టాక్ వచ్చేసింది. వెంటనే దర్శక,నిర్మాతలు రంగంలోకి దిగి సెకండాఫ్ ని ఇరవై నిముషాలు కట్ చేసి, ట్రిమ్ చేసి వదిలారు. అయినా ఈ సినిమాకు లాస్ లు తప్పేటట్లు లేవు. దాదాపు 10 కోట్ల రూపాయలు లాస్ గా కనిపిస్తుంది. మరోవైపు శ్రీమంతుడు మూవీ చెప్పుకొదగ్గ కలెక్షన్స్ తో ముందుకు పోతుంది.

నిర్మాతగా కళ్యాణ్ రామ్ సేఫ్ జోన్ లోకి వెళ్ళినప్పటికీ, కొన్ని ఏరియాల్లో బయ్యర్లు నష్టపోయే పరిస్థితి ఉంది. ఓ వైపు కిక్2 మూవీకి ఆఫ్టర్ ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ చేపడుతుంది. కళ్యాణ్ రామ్, రవితేజ కలిసి ఆ బాధ్యతలను తీసుకున్నారు. కిక్2 పై ఎక్కడా నెగిటివ్ టాక్ రాకుండా ఎప్పటికప్పుడూ పేపర్స్ లోనూ, మీడియాలోనూ కిక్2 ఇంటర్వూలతో ప్రేక్షకులకు టచ్ లో ఉంటున్నారు.

కిక్ అనే బ్రాండ్ తో కిక్2 మూవీని కనీసం ఒక్కసారి చూడటానికి అయినా వస్తారు అనే ఉద్దేశం తో చిత్రయూనిట్ లో కొంత ధీమా ఉంది. ఏదేమైనా కిక్2 పై వస్తున్న విమర్శలను చూస్తుంటే కిక్3 పై హీరో ఆసక్తి చూపుతాడో? లేదో? చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: