గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ సౌత్ సినిమాలపై కన్నేసింది, బాలీవుడ్లో ఓ రేంజ్ కి వెళ్లిపోదామనుకున్న అమ్మడి ఆశలకు నీళ్లు చల్లేశారు అక్కడ దర్శక నిర్మాతలు. తెగ రెచ్చిపోయి ఎక్స్ పోజింగ్ గట్రా చేసినా ఏం లాభం లేకుండా పోయింది. అందుకే ఇక చిన్నగా సౌత్ బాట పట్టింది. ఇక్కడ మంచి మార్కెట్ ఉన్న అమ్మడు స్టార్ స్టేటస్ రాగానే బీ టౌన్ కి జంప్ అయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ చిన్నగా ఇక్కడ వారికి తన అందాల మత్తులో మునిగిపోయేలా చేయడానికి రెడీ అవుతుంది.  

 

అవకాశాల కోసం ఏ చిన్న ఈవెంట్ ని వదలకుండా ఇన్విటేషన్ అందినా అందకపోయినా వచ్చేస్తుంది. అదీగాకా రోజు ఏదో ఒక న్యూస్ లో ఉండాలని తెగ తాపత్రయ పడుతుంది ఈ హాట్ గాళ్. అందుకే తను షాపింగ్ కి వెళ్లినప్పుడు చేసే బేరాల గురించి అందరికి చెబుతుంది. అమ్మడు షాపింగ్ చేసేటప్పుడు ఆ షాప్ వాడికి చుక్కలు చూపిస్తుందట డబ్బులు ఉన్నాయ్ కదా అని కాకుండా వస్తువుని బట్టి తెగ బేరం ఆడేసేదట. షాప్లోనే కాదు చివరకు ఫుట్ పాత్ మీద అమ్ముకునే వాడి దగ్గర కూడా బేరమాడడం మానదట.


ఇలియానా హాట్ స్టిల్ :

 

అలా సంపాధించిన డబ్బు కాస్త బేరమాడి పొదుపు చేయబట్టే ఇప్పుడు సినిమా అవకాశాలు లేకపోయినా కాస్త నిలబడగలుగుతుందని సెటైర్స్ వేస్తున్నారు అందరు. ఇక్కడ ఎలాగైనా తన పాత పంథా కొనసాగించాలని చూస్తుంది ఈ బర్ఫీ బ్యూటి.. కాని ఐటంగా ఓకే గాని హీరోయిన్ గా అయితే కాస్త ఆలోచిస్తున్నారు స్టార్ హీరోలు. అందుకే బేరాలు పొదుపులు అంటూ కబుర్లు చెబుతుంది సుందరి.

 

ఒకవేళ తనదగ్గర కొచ్చి బేరాలాడండి సినిమా చేస్తా అని ఇన్ డైరెక్ట్ గా చెబుతుందేమో అని అనుకుంటున్న వారు కూడా ఉన్నారు. ఏమ్మా ఇలియానా ఏంటి నీ మాటల్లోని అంతరార్ధం.


మరింత సమాచారం తెలుసుకోండి: