ఈరోజువరకు మెగా హీరోల హవాతో షేక్ అవుతున్న టాలీవుడ్ సినిమా రంగానికి ఇదే కుటుంబానికి చెందిన మెగా డాటర్ షాకింగ్ ట్విస్ట్ ఇస్తోంది. ఫిలింనగర్ లో వినిపిస్తున్న గాసిప్పుల ప్రకారం మెగా బ్రదర్ నాగబాబు తన కుమార్తెను హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఎంట్రీ ఇవ్వడానికి అంగీకరించడమే కాకుండా దానికి సంబంధించిన కొన్ని వెరైటీ కథలను నాగబాబు వింటున్నాడని టాక్.

ఈ వ్యవహారానికి చిరంజీవి ఆశిస్సులు ఉన్నాయి అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. అయితే సాధారణ హీరోయిన్స్ లా కాకుండా ఎటువంటి గ్లామర్ షోలు చేయకుండా కేవలం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను నిహారిక చేత నటింప చేయాలని మెగా కుటుంబం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా నిజంగానే నిహారిక టాలీవుడ్ ఎంట్రీ ఇస్తే అది ఒక సంచలనమే అవుతుంది. గతంలో ఇదేవిధంగా అక్కినేని మనవరాలు సుప్రియ కృష్ణ కూతురు మంజుల లాంటి కొందరు టాలీవుడ్ సినిమాలలో ఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్ లో తమకoటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకోలేకపోయారు. అయితే బుల్లితెర సెలెబ్రెటీగా ఇప్పటికే తన కంటూ ఒక ఇమేజ్ ని ఏర్పరుచుకున్న నిహారికకు ఈ సమస్య ఉండదు అనే మాటలు వినిపిస్తున్నాయి. 

నిహారిక ఇప్పటికే బుల్లితెర పై ‘జూనియర్స్’ ‘గప్ చిప్’ లాంటి షోలకు ప్రజంటర్ గా వ్యవహరిస్తూ మెగా ఆధిపత్యాన్ని బుల్లితెర పై కొనసాగిస్తోంది. దీనికితోడు అనుకున్న విధంగా మంచి స్క్రిప్ట్ దొరికి హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఖరారు అయితే మెగా కుటుంబం నుండి వచ్చిన మొదటి హీరోయిన్ గా నిహారిక రికార్డు క్రియేట్ చేయడం ఖాయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: