తెలుగు ఇండస్ట్రీలో విలక్షన నటుడిగా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు తనయుడిగా వెండి తెరకు పరిచయం అయిన మంచు విష్ణు.. అంతే కాకుండా  తండ్రి స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓ గా వ్యవహరిస్తున్నారు. మంచు విష్ణు హీరోగా వచ్చి పది సంవత్సరాలు పూర్తయ్యింది. వాస్తవానికి తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఏవీ లేకున్నా తెలుగు ప్రేక్షకులకు మాస్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు. అంతే కాదు విష్ణు ఈ మద్య సంపూర్ణేష్ బాబు లాంటి హీరోతో ‘సింగం 123’ సినిమాతో నిర్మాత అవతారం కూడా ఎత్తారు.

తాజాగా దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్న 'డైనమైట్‌' చిత్రం ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌. సినిమా నిండా ఫైటింగులూ, ఛేజింగులే. అందుకే యాక్షన్‌ ఎపిసోడ్స్‌పై ప్రత్యేకమైన దృష్టిపెట్టారు విష్ణు. కేవలం ఫైట్స్‌ కోసం 47 రోజులు కేటాయించారంటే ఈ సినిమాలో యాక్షన్‌కి ఉన్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. సెప్టెంబర్  4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు మంచు విష్ణు హనుమంతుడుగా దర్శనమివ్వబోతున్నాడట..తెలుగు,ఇగ్లీష్, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది.

డైనమైట్ చిత్రంలో మంచు విష్ణు


హనుమంతుడు పుట్టుక నుంచి హిమాలయాలకు ఆయన వెళ్లటం వరకూ చూపనున్నట్లు చెప్తున్నారు. భారీ ఎత్తున ఈ చిత్రం రూపొందనుందని చెప్పారు. హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ సాయింతో ఈ ప్రాజెక్టుని పట్టాలు ఎక్కిస్తారు. అలాగే దర్శకుడు సైతం హాలీవుడ్ నుంచి తీసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇండియన్ మైధాలిజీకు ఇంటర్నేషనల్ ట్రీట్ మెంట్ ఇస్తారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: