ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా వినిపిస్తున్నది చిరుపై సుమన్ కామెంట్స్. అవును చిరంజీవి పై చేసిన కామెంట్స్ అందరినీ షాక్ కి గురి చేస్తున్నది. సుమన్ నోటి నుండి చిరు దేవుడు, లక్కీ ఫెలో, గాడ్స్ గిప్ట్ వంటి పదాలు వరుసగా వినపడేసరికి సుమన్ రియాక్షన్ కంటే..సమన్ మాట్లాడిన మాటలకు అందరూ షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వ్యవహారం ప్రముఖ ఛానల్ లో ప్రత్యేక కథనం ప్రసారం అయింది. ఆ వివరాలను ఓ సారి చూస్తే,హీరోగా సుమన్ సుదీర్ఘ కెరీర్ నే సాగించాడు. 

80లలో ఇప్పుడున్న స్టార్ హీరోలతో సమానమైన హీరో. సుమన్ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హీట్లే. అప్పట్లో బాలక్రిష్ణ, చిరంజీవిలు టాప్ పొజిషన్ లో ఉంటే, వారికి ధీటుగా రాజశేఖర్, సుమన్ లు గట్టిపోటీ ఇచ్చేవారు. వీరందరిలో చిరంజీవి ఎప్పుడూ పై చేయిగా ఉండేవాడు. అలాంటిది కొన్ని సంవత్సరాల పాటు చిరంజీవికి పోటీగా సుమన్ టాప్ పొజిషన్ లో నిలిచాడు. సుమన్ స్టార్ డం కి చిరంజీవి మూవీలు సైతం డౌన్ ఫాల్ అయ్యేవి. కేవలం వారం రోజుల గ్యాప్ లో వీరిద్దరి మూవీలు రిలీజ్ అయితే సుమన్ మూవీ బాక్సాపీస్ వద్ద పై చేయిగా నిలిచేది. ఇలాంటి సందర్భంలో సుమన్ కెరీర్ లో అనూహ్యమైన కుదుపు.

ఆ తర్వాత అతడు పూర్తిగా నటనకు కామా పెట్టాల్సొచ్చింది. కాల క్రమంలో సుమన్ తిరిగి సినిమాల్లో విలన్ వేషాలతో నెగ్గుకొచ్చాడు. రీసెంట్ గా తన పుట్టినరోజు సందర్భంగా ఓ టీవీ యాంకర్ అడిగిన ప్రశ్నకు సుమన్ చాలా సీరియస్ గా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి వల్లే మీ కెరీర్ స్పాయిల్ అయ్యిందా? అన్న ఓ ప్రశ్నకు..'ఏం మాట్లాడుతున్నారు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటూ సుమన్ సీరియస్ అయ్యారు. చిరంజీవి ఆంజనేయస్వామి భక్తుడు. ఆయనెప్పుడూ చిల్లర పనులు చేయలేదు. నాకు జరిగిన ఇష్యూ లో చిరంజీవికి ఏ సంబంధం లేదు. 200శాతం ఆయన దూరంగానే ఉన్నారు. తెలుగు సినిమా హీరోకి కావాల్సిన అర్హతలన్నీ చిరులో ఉన్నాయి. అవి ఆయనకి దేవుడిచ్చిన గిఫ్ట్'' అంటూ సుమన్ క్లారిటీ ఇచ్చాడు.

ఇదే ప్రశ్నను కొన్ని దశాబ్ధాల క్రితం సుమన్ ఎవరైనా అడిగితే దేవుడే సమాధానం చెప్పాలి, ఎంత వరకూ నిజమో చెప్పలేము అంటూ చెప్పుకొచ్చాడంట. సుమన్ పై వచ్చిన జైలు రూమర్ తరువాత చిరుతో సుమన్ మాట్లాడటానికి చాలానే సంత్సరాలు పట్టింది. ఏదేతైనేం, సుమన్, చిరు లపై వస్తున్న రూమర్ ఎంత మాత్రం నిజం కాదనేది ఫైనల్ గా రివీల్ అయింది.




మరింత సమాచారం తెలుసుకోండి: