టాలీవుడ్ యంగ్  జనరేజర్ కి చెందిన యువ నటుడు అఖిల్ అక్కినేని, డెబ్యూ మూవీతో అలరించబోతున్నాడు. అఖిల్ కి  మొదటి మూవీ అయినప్పటికీ, ఎక్స్ పీరియన్స్డ్ హీరోగా కనిపిస్తున్నాడంటూ స్వయంగా డైరెక్టర్ వినాయక్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడంట. ఇదిలా ఉంటే ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న డెబ్యూ చిత్రానికి ‘అఖిల్’ అని టైటిల్ ఖరారు చేశారు.

ఈ చిత్రానికి సంబంధించి ఇదివరకే ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేయగా.. అవి చాలా బాగున్నాయంటూ ప్రశంసలొచ్చాయి. అలాగే అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా తాజాగా టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ లో అఖిల్ యాక్షన్ సన్నివేశాలను అందరినీ అబ్బురపరిచేలా వున్నాయి. కానీ.. ఈ టీజర్ లో ఓ ముఖ్యమైన అంశాన్ని చూపించడం మాత్రం మరిచిపోయారు.

అంతే కాకుండా ఫ్యాన్స్ సైతం అఖిల్ నుండి ఎక్స్ పెక్ట్ చేసింది లేకపోవడంతో అందరూ నిరుత్సాహ పడ్డారు. టీజర్ లో అఖిల్ యాక్షన్ ఫెర్ఫార్మెన్స్ అధరగొట్టాడు. తన మొదటి టీజర్ లో అఖిల్ వాయిస్ ఉంటుందని అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ, అఖిల్ వాయిస్ లేకుండా టీజర్ ని రిలీజ్ చేయటంతో ఫీల్ మిస్ అయిందంటూ, చాలా మంది కనెక్ట్ కాలేకపోయారంటూ ఇండస్ట్రీలోనూ టాక్స్ వినిపిస్తున్నాయి.

ఈ విషయం గుర్తించిన చిత్ర యూనిట్ అఖిల్ వాయిస్ తో ఓ 20 సెకండ్స్ ఉన్న సెకండ్ ప్రమోషనల్ టీజర్ ని త్వరలోనే రిలీజ్ చేయనున్నారంట. ఏదైతేనేం, తన మొదటి చిత్రానికి సంబంధించిన టీజర్లోనే అఖిల్ అద్భుతంగా తన యాక్షన్ పెర్ఫార్మెన్స్ ని కనబరిచాడని ప్రశంసలైతే వస్తున్నాయి. ఇందులో సాయేషా సెహగల్ హీరోయిన్ గా నటిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: