ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి, జిల్ తో లైమ్ లైట్లోకి వచ్చిన డస్కీ బ్యూటీ రాశి ఖన్నా ప్రస్తుతం రామ్ ‘శివమ్’ సినిమాలో నటిస్తుంది. కేవలం కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సినిమాలో మంచి రోల్స్ పడుతుంటాయ్. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లా కాకపోయిన నటించే సినిమాల్లో తమ క్యారక్టర్ కి ఇంపార్టెన్స్ వస్తే.. హీరోయిన్స్ కి ఆ కిక్కే వేరుగా ఉంటుంది. సరిగ్గా ఇలానే ఫీల్ అవుతుంది హీరోయిన్ రాశి ఖన్నా.


హీరోయిన్ అంటే ఏదో రెండు సీన్లు..నాలుగు పాటల్లో కనిపించినట్టు కాకుండా అమ్మడు ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ గా కనిపించనున్నదట. ఖాకీలో రాశి అదరగొట్టబోతుందని చెబుతున్నారు చిత్ర యూనిట్. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా కెరియర్ బిల్డప్ కోసం ఇలాంటి క్యారక్టర్లు ఉపయోగపడతాయి.


శివమ్ సినిమాలో ఓ పక్క గ్లామర్ సోయాగాలు చూపిస్తూ.. పోలీస్ గా ఇరగదీస్తుందట రాశి ఖన్నా. కేవలం రెండు సాంగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుందట. ప్రస్తుతం ట్రెండీ హీరోయిన్లలో రకుల్ హవా కొనసాగిస్తుండగా రాశి కూడా ఒక రేంజ్ ఫాంలో ఉంది. వరుసెంట ఆఫర్లు కొట్టేస్తూ హాట్ బ్యూటిగా చాన్సులు కొట్టేస్తుంది. మరి అంతేకాదు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రల్లో కూడా నటించి అలరిస్తుంది ఈ చిన్నది.


రాశి ఖన్నా హాట్ స్టిల్ :  

 

శ్రీనివాస్ రెడ్డి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్న ఈ సినిమా స్రవంతి మూవీస్ బ్యానర్లో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకుని సెప్టెంబర్లో రిలీజ్ అవ్వబోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: