బాలీవుడ్లో హీరోయిన్ సినిమా తీస్తుందంటే చాలు, ఆ సినిమాలో హీరో హీరోయిన్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ కన్నా ఆఫ్ స్క్రీన్ రొమాన్సే ఎక్కువైపోతుంది.. ఆఫ్టర్ షూటింగ్ చెట్టపట్టాలేసుకుని పబ్బులు డిస్కోలని తిరుగుతుంటారు. ఇది అక్కడ కామనే అని చెప్పాలి. అయితే నటిస్తున్న సినిమా హీరోతో కాకుండా వేరే బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తుందట ఓ సుందరి. ఇంతకీ ఆమె ఎవరా అని ఓ తెగ ఆలోచించేయకండి.. టాలీవుడ్లో ‘1 నేనొక్కడినే’, ‘దోచేయ్’ సినిమాలతో ఐరన్ లెగ్ అనిపించుకున్న కృతి సనన్ ఇప్పుడు బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ అయ్యింది.


టైగర్ ష్రాఫ్ తో చేసిన‘హీరో పంటి’ సినిమా హిట్ అయ్యే సరికి అమ్మడికి ఏకంగా షారుఖ్ ఖాన్ సినిమాలోనే ఆఫర్ వచ్చింది. ఆఫర్ అయితే షారుఖ్ ఖాన్ సినిమాలోనే కాని సినిమాలో షారుఖ్ కి జోడీగా కాదు.. షారుఖ్ కాజోల్ చాలా కాలం తర్వాత కలిసి నటిస్తున్న ‘దిల్ వాలే’ సినిమాలో వరుణ్ ధావన్ కి జోడీగా చేస్తుంది ఈ యాడ్ల బ్యూటి. ఇదే కాదు బాలీవుడ్లో ఇంకా మూడు సినిమాల ఆఫర్లు లైన్లో ఉన్నాయి అమ్మడికి.

 

కృతి సనన్ హాట్ లుక్ :   

 

అయితే సాఫీగా సాగిపోతున్న ఆమె కెరియర్ కి డేటింగ్ సమస్య వచ్చి పడ్డది. కృతి సనన్ బాలీవుడ్ అప్ కమింగ్ హీరో గౌరవ్ అరోరాతో డేటింగ్ చేస్తుందని బీ టౌన్ రచ్చ రచ్చ చేస్తుంది. ఆమె మోడలింగ్ చేసే టైమ్ నుండి గౌరవ్ తెలుసు కాబట్టి అతనితో కొంచం క్లోజ్ గా ఉంటుందట కృతి సనన్.

 

 దాన్నే చూసి వారు డేటింగ్ గట్రా చేసుకుంటున్నారని రూమార్లు క్రియేట్ చేసింది బాలీవుడ్ మీడియా. దీని గురించి కృతిని అడిగితే ఏంటి నేనా.. డేటింగా.. అతనితోనా.. నోవే అని యాడ్ లో ఫోజులిచ్చినట్టు ఇస్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: