టాప్ హీరోల సినిమాకధలకు సంబంధించి కాపీ రూమర్స్ రావడంతో పాటు ఆసినిమాల ఫస్ట్  లుక్ లు కూడ కాపీ వివాదంలో చిక్కుకోవడం పరిపాటి అయిపోయింది. టాలీవుడ్ లో చరిత్ర సృస్టించిన ‘బాహుబలి’ సినిమాకు కూడ ఈ కాపీ వివాదాలు తప్పలేదు. ఈనేపధ్యంలో గతవారం విడుదల అయిన ‘అఖిల్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ చుట్టూ కూడ ఈ కాపీ వివాదం చుట్టుకుంది. 

అఖిల్ ఫస్ట్ లుక్ హాలీవుడ్ మూవీ ‘డ్రేగాన్ బాల్’ సినిమా ఫస్ట్ లుక్ కు కాపీ అంటూ వెబ్ మీడియాలో కొందరు ఈరెండు సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 2009 లో విడుదలలైన ఈ సినిమా ఒక ఎడ్వెంచర్ ఫ్యాంటసీ. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ వోంగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ఒక దుష్టశక్తిని ఎదుర్కొనడానికి ఈసినిమాలో హీరో 8 డ్రాగన్ బాల్స్ వాడి దుష్టశక్తి పై విజయం సాధిస్తాడు. అఖిల్ సినిమా కధ కూడ ఒక ఫ్యాంటసీ కాబట్టి ఒక బాలను క్రియేట్ చేసి అఖిల్ చేతిలో పెట్టారు అనుకోవాలి.  ఈసినిమా కధ విషయంలో ఇప్పటివరకు సస్పెన్స్‌ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో కొన్ని చోట్ల ఈ మూవీ షూటింగ్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. 

కాని స్టోరీ పై ఎక్కడా క్లారిటీ లేదు కేవలం అఖిల్ లుక్ ను బట్టి ఈ సినిమా కధను అంచనా వేస్తున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా నాగార్జున పుట్టిన రోజునాడు విడుదల అయిన ఈ సినిమా టీజర్ ను 36 గంటలలో 5 లక్షల మంది  చూడటం ఒక రికార్డుగా చెపుతున్నారు. ఇక రాబోతున్న రోజులలో ఈ సినిమా కథ పై ఇంకా ఎన్ని కాపీ రూమర్స్ వస్తాయో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: