తెలుగు చిత్ర సీమలో ఇప్పటి వరకు ప్రయోగాత్మక క్యారెక్టర్స్ ఎక్కువగా విశ్వ నటుడు కమల్ హాసన్ తర్వాత విక్రమ్ లు చేయడం చూశాం.. వీరికి ధీటుగా అందాల తార అందులోనూ యోగా తో ఫిట్ నెస్ కు మారుపేరుగా ఉన్న హీరోయిన్ అనుష్క చేసిన ప్రయోగం చూస్తూంటే ఔరా అనిపిస్తుంది.. తాజాగా అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న 'సైజ్‌ జీరో' టీజర్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.  ఈ టీజర్ చూస్తుంటే ఔరా నిజంగా అనుష్క ఇలా ఉందా అని ఆశ్చర్యం వేస్తుంది. అధిక బరువుతో అనుష్క పడే తంటాలు, బరువు మనిషి లక్ష్యానికి ఆటంకం కాదని నిరూపించే మంచి మెస్సేజ్ ఓరియెంటె సినిమాను ప్రకాశ్ కోవెలమూడి తెరకెక్కిస్తున్నారు.

తెలుగు తమిళ భాషలో వస్తోన్న ఈ సినిమాను ప్రసాద్ వి పోట్లూరి నిర్మిస్తున్నారు. అనుష్క మరింత లావుగాను .. మరికాస్త సన్నగాను డిఫరెంట్ లుక్స్ తో కనిపించే 'సైజ్ జీరో' సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో వస్తున్న సైజ్ జీరో సినిమా టీజర్ విడుదలయింది. అనుష్క అదేపనిగా తింటూ .. భారీకాయంతో అవస్థలు పడుతోన్న దృశ్యాలతో ఈ టీజర్ ను కట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ హల్ చేస్తోంది. అనుష్క తన ఫేస్‌బుక్, ట్విట్టర్ వాల్‌పై ఈ టీజర్‌ను అప్‌లోడ్ చేసింది. అనుష్క సరసన హీరోగా ఆర్య నటిస్తున్నాడు.

సైజ్ జీరో చిత్రంలో అనుష్క


అనుష్క వెయిట్ చూసుకునే మెషిన్ లో కాయిన వేసి తన బరువు చూసుకుంటుంది. బయటికి వచ్చిన టికెట్ చూసుకుని బరువు తగ్గినందుకు హ్యాపీ రియాక్షన్ ఇస్తుంది. ఆ టికెట్ కి మరో వైపున ఆడియో విడుదల సెప్టెంబర్ 6 అని రాసి ఉంటుంది.  రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమా ఆడియోను సెప్టెంబర్ 6న హైదరాబాదు - నోవాటెల్ హోటల్లో ప్లాన్ చేశారు. మొత్తానికి అనుష్క తెలుగు చిత్ర సీమలో అద్భుతమైన క్యారెక్టర్స్ పోషిస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటుందీ అన్న దాంట్లో అతిశయోక్తి లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: