టాలీవుడ్ లో రెండు డిఫ్రెంట్ మూవీలకే తను స్టార్ పొజిషన్ కి వెళ్ళాడు. హీరోలు అతడి వెంట పడ్డారు. కానీ, ఆ డైరెక్టర్ మాత్రం అంత త్వరగా ఏ హీరోలకు కాల్షీట్స్ ని ఇవ్వలేదు. తను ఎంచుకున్న కథ పూర్తిగా పేపర్ మీదకు వచ్చిన తరువాత హీరోల దగ్గరకు వెళ్ళేవాడు ఆ దర్శకుడు. తనే స్టార్ డైరెక్టర్ దేవకట్టా. వెన్నెల, ప్రస్థానం సినిమాలు దేవా కట్టాకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘ఆటోనగర్ సూర్య’ ఫ్లాపైనా అతడి ప్రతిభను ఎవ్వరూ తక్కువ చేయలేరు.

తాను చేసిన మూడు సినిమాల్లోనూ వైవిధ్యం చూపించిన ఈ దర్శకుడు.. మరో కొత్త కథాంశంతో ముందుకొస్తాడనుకుంటే.. అతనేమో రీమేక్ ఎంచుకున్నాడు. తమిళంలో విజయవంతమైన ‘అరిమా నంబి’ని ‘డైనమైట్’గా రీమేక్ చేశాడు. ఐతే వాస్తవానికి తనకు రీమేక్ సినిమా చేసే ఉద్దేశం లేదని..‘అరిమా నంబి’ని కూడా ఆసక్తి లేకుండానే చూశానని.. కానీ సినిమా చూశాక తనకు బాగా నచ్చి రీమేకు కు ఒప్పుకున్నానని దేవా చెప్పాడు. ‘‘విష్ణుకు అరిమా నంబి నచ్చింది. 

నన్ను చూడమన్నాడు. నాకు ఆసక్తి లేకుండానే సినిమా చూశాను. ఐతే చూశాక బాగా నచ్చింది. అందులోని క్యారెక్టర్లతో అప్పటికప్పుడు కనెక్టైపోయాను. రీమేక్ కు దర్శకత్వం వహించడానికి అంగీకరించాను’’ అని చెప్పాడు. అయితే డైనమైట్ మూవీ గురించి దేవకట్టా చెప్పుకున్న వర్షన్ ఇలా ఉంటే, తాజాగా ఓ స్టార్ హీరో దేవకట్ట కథని మాత్రం ముక్కుసూటిగా రిజెక్ట్ చేశాడంట. అంతే కాకుండా మరో 3 సంవత్సరాలు ఎటువంటి కథలతో రావద్దని అన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి.

గతంలో ప్రస్థానం మూవీ అనంతరం ఆ హీరో, దేవకట్టా వెనుక సంవత్సరం పాటు వేచి ఉన్నాడంట. కథను రెడీ చేసుకోవటానికి సంవత్సరం తీసుకున్న డైరెక్టర్, ఇక ఆ మూవీని ఏ విధంగా చేస్తాడో? అని డౌట్ వచ్చి...దేవకట్టాతో రిలేషన్ ని తగ్గించాడంట. ప్రస్తుతం ఫాంలో ఉన్న ఆ హీరో, దేవకట్టాని 3 సంవత్సరాల వరకూ దగ్గరకి రాకు అని చెప్పటంతో ఈ న్యూస్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాక్స్ గా వినిపిస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: