సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వచ్చిన బాహుబలి విజయం, యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి సైతం బాహుబలి రికార్డ్స్ కి మైండ్ బ్లాంక్ అయిందట. అందుకే బాహుబలి విజయం నిజంగా ఓ వండర్, మూవీ అద్భుతంగా ఉంధి అంటూ రాజమౌళిని అప్రిసియేట్ కూడ చేశాడు.

గత కొంత కాలం వరకూ సౌత్ లో భారీ బడ్జెట్ మూవీలు తీయాలంటే అది కేవలం శంకర్ కి మాత్రమే సాధ్యం అనే ట్రేడ్ మార్క్ ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది. దీంతో శంకర్ తిరిగి తన సత్తా చాటాలనుకుంటున్నారు. అందుకే రోబో2 పనులు శరవేగంగా చేపట్టాడు. అయితే తను రోబో2 ప్రాజెక్ట్ ఫై తీసుకుంటున్న కేరింగ్ చూస్తుంటే చాలా మంది బాహబలి కాదు రోబో2 గురించి కొత్త విషయాలు చెప్పండి అంటూ ఆసక్తి చూపుతున్నారంట. ఇక రోబో2కి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వం లో రోబో 2 సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. రజనికాంత్ హీరోగా నటించే ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ నటుడు నటిస్తున్నాడనే న్యూస్ పై క్లారిటి టాక్స్ చిత్ర యూనిట్ లో వినిపిస్తున్నాయి. అలాగే బిటౌన్ నుండి ప్రముఖ స్టార్ సైతం చిన్నపాటి నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ప్రస్తుతం రజని కాంత్ కబలి చిత్రం లో నటిస్తున్నాడు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 10 నుండి మొదలు కానుంది. ఈ సినిమాను మూడు నెలల్లో పూర్తీ చేయడానికి ప్లాన్ చేసారు. ఈ సినిమా తరువాత శంకర్ రోబో 2 లో రజని నటిస్తాడు. జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. రోబో 2 చిత్రాన్ని 300 కోట్ల భారి బడ్జెట్ తో తెరేక్కిస్తున్నారు! ఈ సినిమాతో ఇండియన్ సినిమా 1000 కోట్ల రూపాయల బాక్సాపీస్ ని టార్గెట్ చేసుకుందనే టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: