తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన హీరో కృష్ణంరాజు తమ్ముడు కొడుకు ఉప్పలపాటి ప్రభాస్ రాజు ‘ఈశ్వర్’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. వచ్చే రావడంతోనే మాస్ క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకుల ఇట్టే గుర్తు ఉండిపోయేలా క్యారెక్టర్ లో లీనమై నటించాడు. మంచి ఫిజిక్, అందం,ఆకర్షనీయమైన నవ్వు,గంభీరమైన కంఠం ఇవన్నీ ప్రభాస్ కు  బాగా కలిసివచ్చాయి. ఒక హీరోకు ఉండే అన్ని క్వాలిటీలు ప్రభాస్ సొంతం.

ప్రభాస్ నటించిన సినిమాల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘చత్రపతి’ చిత్రం బ్లాక్ బ్లస్టర్ అయ్యింది. తర్వాత వచ్చిన డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్,మిర్చి లాంటి సినిమాలో అద్భుతమైన విజయాలు సాధించి ప్రభాస్ ను అగ్ర హీరోల స్థానంలో నిలబెట్టాయి. ఈ మద్య విడుదలైన ‘బాహుబలి’ చిత్రంతో మనోడి ఖ్యాతి ప్రపంచ స్థాయిలోకి వెళ్లిపోయింది. హింది,తమిళ,మళియాళీ భాషల్లో ‘బాహుబలి’ సాధించిన విజయం అంతా ఇంతా కాదు... మరి ఇంత సక్సెస్ గా దూసుకు వెళ్తున్న ప్రభాస్ స్టిల్ బ్యాచ్ లర్. ఇప్పటికే మనోడి వయసు హీరోలు అందరూ పెళ్లిల్లు చేసుకుని పిల్లలను కూడా కన్నారు.

బాహుబలి పోస్టర్


ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రం షూటింగ్ టైమ్ లో పెళ్లి తంతు నడిచినప్పటికీ సినిమా కెరీర్ ముఖ్యమైన ఆ విషయాన్ని పోస్ట్ పోన్ చేశాడు. బాహుబలి చిత్రం విజయం సాధించిన  కృష్ణంరాజు బంధువుల అమ్మాయి రెడీగా ఉందని, ఆమెను ప్రభాస్ ఓకే చేశాడని  వినిపిస్తోంది. ప్రభాస్ పెళ్లి విషయంలో ఇప్పటివరకూ కండీషన్స్ పెట్టిన రాజమౌళి కూడా పెళ్లికి ఓకే అన్నాడట. మరి ప్రభాస్ ఈ సంవత్సరం అభిమానులకు తీపి కబురు అందిస్తాడా.. షరా మామూలే సినిమాలే ప్రధానం అంటాడా..! వేచి చూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: