తెలుగు చిత్ర పరిశ్రమలోకి మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా "కళ్యాణ బాబు"గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాన్ గా పేరు మార్చుకున్నాడు.  ఇతనికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది.  తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు, పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచనా ధోరణే పవన్ కళ్యాణ్ కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. ఇక చిరంజీవి తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకున్న హీరోల్లో పవన్ కళ్యాన్ ఒకరు.

పవన్ కళ్యాన్ మొదటి నుంచి అభ్యుదయ భావాల కలిగిన వ్యక్తి కావడంతో ప్రజలకు సేవ చేయాలని..బ్రష్టు పట్టిన రాజకీయాన్ని ప్రశ్నించాలనే ఉద్దశ్యంతో ‘జనసేన’ అనే పార్టీ స్థాపించారు. పవన్ కళ్యాన్ చాలా సాదా సీదా జీవితాన్ని కోరుకునే వ్యక్తి అడంబరాలకు అస్సలు పోడు.. అందే చేతనే తన పుట్టిన రోజు వేడుకలు కూడా బహిరంగంగా చెప్పకపోవడం..పెద్ద పెద్ద పార్టీలు ఏర్పాటు చేయక పోవడం లాంటి జరుగుతుంది. అంతే కాదు ఆయన పుట్టిన రోజు వేడుకలకు పేద ప్రజలకు ఎంతో కొంత చేసి వారి సేవలో తరించాలన్నదే పవన్ కళ్యాన్ సంకల్పం. అందుకే ఆయన అభిమానులకు కూడా ఇదే విషయం చెబుతారు.

ఈ సారి పవన్ కళ్యాన్ పుట్టినరోజు వేడుకులు భారీగా జరపాలని అతని అభిమానులు అనుకుంటున్నారు. ఎప్పటిలానే భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా రక్తదానం, అన్నదానం వంటివి చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దాంతో పాటు పవన్ ని ఇష్టపడేవాళ్లు మరో మంచి పని చేయాలని అతని అభిమానులు పిలుపు ఇచ్చారు. ఇక పవన్ కళ్యాన్ కు ఓ ఫామ్ హౌజ్ ఉంది అక్కడ ఆయన రక రకాల చెట్లను పెంచుతున్నారు.

పవన్ కళ్యాన్ ఫామ్ హౌజ్ లో మొక్క నాటుతున్న దృశ్యం


పర్యావరణ పరిరక్షణ అంటే పనవ్ కు చాలా ఇష్టం.. పర్యావరణానికి మేలు చేసేవాటిలో చెట్లుకి ప్రాధాన్యం ఉంటుంది. కానీ, చెట్లను అడ్డంగా భావించి, చాలామంది అడ్డంగా నరికేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాన్ కు కానుకగా అభిమానులు ఈ సారి వెరైటీగా ఓ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు.. మరి ఆ గిఫ్ట్ ఎమిటా అనుకుంటున్నారా...?  తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు నాడు తలో చెట్టూ నాటాలని డిసైడ్ అయ్యారు. చెట్టు నాటిన ప్రతి ఒక్కరూ ఆ చెట్టుతో సెల్ఫీ దిగి, ఫేస్ బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ పోస్ట్ చేయలని పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: