పవర్ స్టార్ పవన్ కళ్యాన్ అత్తారింటికి దారేది చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని పవర్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ షర వేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాకు మొదటగా గబ్బర్ సింగ్2 అనుకున్నారు. తర్వాత టైటిల్ కాస్త పవర్ ఫుల్ గా ఉండాలని ‘సర్ధార్’ అనుకున్నారు.. ఇక ఆగస్టు 15 మెగా అభిమానులకు పవర్ ఫుల్ షాక్ ఇచ్చాడు పవన్.


విడుద‌ల చెసిన ఫస్ట్ లుక్‌లో పవన్ తనకెంతో ఇష్టమైన గన్స్‌ను తన రెండు చేతుల్లో పట్టుకోవడంతో పాటు ఒంటిమీద మరో రెండు తుపాకీలతో పవర్ ఫుల్ స్టిల్ తో  కనిపించాడు. ఇక అందరి ఊహలకు అందని టైటిల్  “సర్దార్ గబ్బర్ సింగ్ ” అని పేరును నిర్ణయించారు. పవన్ కళ్యాణ్ ఖాకి డ్రెస్ వేస్తే ఎలా ఉంటుందో గబ్బర్ సింగ్ లో ఇప్పటికే ప్రేక్షకులు రుచి చూశారు. ఈ సినిమాను ప్రముఖ బాలివుడ్ నిర్మాణ సంస్థ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ తెలుగులోని అగ్ర హీరోల చిత్రల హక్కులను సొంతం చేసుకుంటోంది.


సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాన్


ఈ చిత్రం మొత్తం హక్కులను పొందడానికి షుమారు రూ 70 కోట్లు శరత్ మరార్ కు ఈరోస్ చెల్లించిందని సమాచారం.  ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తి తో ఎదురు చూస్తున్న చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్ '.  బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇటీవలే రెండు షెడ్యూల్లు పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ రెండో షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్నారు. కాగా ఈ సినిమా మొదటి టీజర్ ను సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు  విడుదల చేస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: