తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంటర్ కావాలంటే అదృష్టం ఉండాలి.. కానీ తన తొలి చిత్రంతోనే ‘బర్నింగ్ స్టార్’ గా పేరు తెచ్చుకున్న హీరో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన హీరో నవ్వులకు కేరాఫ్ అడ్రాస్ గా నలిచిన హీరో ఎవరో ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది..అవునండీ సంపూర్ణేష్ బాబు.. హృదయ కాలేయం అనే వెరైటీ టైటిల్ తో సోషల్ మీడియాలో హల్ చేస్తూ అందరికీ పరిచయం అయ్యాడు. తర్వాత చిత్ర విచిత్రమైన ఫోటోలు.. పెరడీలు.. హీరోల స్టయిల్స్ అనుకరిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

వాస్తవానికి హృదయ కాలేయం చిత్రంలో సంపూ నటనా పరంగా అంతగా మెచ్యూర్ గా లేకపోయినా పంచ్ డైలాగులతో కేక పుట్టించాడు. తర్వాత కొన్ని చిత్రాల్లో చిన్నా చితక వేషాలు వేస్తూ.. మంచు విష్ణు నిర్మాతగా తీసిన సింగం123 ఫుల్ లెంత్ హీరోగా యాక్ట్ చేశాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా సంపూర్ణేష్ బాబు మరోసారి పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ కి కేరాఫ్ అడ్రాస్ గా మారారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసుకున్న సంపూర్ణేష్ బాబు మరో కొత్త సినిమాతో వెండి తెరపై దర్శనమివ్వబోతున్నారు. సంపు నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరి మట్ట' సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది.'హృదయ కాలేయం' అనే చిత్రమైన టైటిల్‌తో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కామెడీ హీరో బర్నింగ్ స్టార్.....మరో విచిత్రమైన టైటిల్‌లో మరో సినిమాకు రెడీ అయ్యాడు.

సంపూర్ణేష్ బాబు నటించిన హృదయ కాలేయం, సింగం 123


ఆ సినిమా పేరు 'కొబ్బరి మట్ట'. 'ది లీవ్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మ్యాన్' అనేది సబ్ టైటిల్.  ఈ సినిమాలో ట్విస్ట్ ఏంటంటే.. సంపూ త్రిపాత్రాభినయం చేయబోతున్నాడట.. నిజమే పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడ్ అనే మూడు పాత్రలు పోషించబోతున్నాడట. మరి మూడు క్యారెక్టర్లలో మనోడు ఏ రేంజ్ లో పంచ్ డైలాగ్స్ వదులుతాడో.. ఏ రేంజ్ లో నవ్విస్తాడో అన సినీ వర్గాలు అనుకుంటున్నారు.  ఈ సినిమాకు దర్శకత్వం రూపక్ రొనాల్డ్ రాస్, నిర్మాత ఆది కుంభగిరి, సాయిరాజేశ్ నీలం, కథ, స్క్రీన్‌ప్లే-మాటలు స్టీవెన్ శంకర్.


మరింత సమాచారం తెలుసుకోండి: