ఇప్పటి వరకు సినిమా సెలెబ్రెటీల సినిమాల ఆడియో ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, షష్టిపూర్తి ఫంక్షన్స్ ను కవర్ చేయడానికి కొన్ని ఛానల్స్ ఆ సెలెబ్రెటీలకు ఎదురు డబ్బులు ఇచ్చిన సందర్భాలు చూసాము. కాని ఈ పద్ధతులు అన్నింటికి భిన్నంగా ఒక స్టార్ హీరో కూతురు పెళ్ళి వెడ్డింగ్ కార్డ్స్ బ్లాక్ లో అమ్మిన ఘనత కన్నడ సినిమా రంగంలో జరిగింది. 

కన్నడ కంఠీరవ డాక్టర్. రాజ్‌కుమార్‌ పేరు ఎరగని వారు ఉండరు. ఆయన మనవరాలు కన్నడ హీరో శివరాజ్‌కుమార్‌ కుమార్తె డాక్టర్‌ నిరుపమ వివాహానికి దక్షిణది సినిమా రంగం అంతా కదిలి వచ్చింది. రాజకీయ నేతలతో పాటు టాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు ఎందరో హాజరైన ఈ వివాహం అత్యంత విలాసవంతమైన పెళ్ళిగా దక్షిణాది సినిమా రంగంలో రికార్డు క్రియేట్ చేసింది. 

నిన్న బెంగళూరులోని ప్యాలెస్‌ మైదానంలో జరిగిన ఈ వివాహ వేడుకకు మన టాలీవుడ్ సెలెబ్రెటీలు రాజమౌళి, నాగార్జున, రామ్ చరణ్, శ్రీకాంత్, హరికృష్ణలతో పాటుగా మరెందరో టాలీవుడ్ సెలెబ్రెటీలు ఈ పెళ్ళిలో సందడి చేసారు. కన్నడ సూపర్ స్టార్ గా పేరుగాంచిన శివరాజ్ కుమార్ కూతురు నిరుపమ పెళ్ళికి 50 వేలమంది అతిధులు రావడమే కాకుండా 15 కోట్లు ఈ పెళ్ళికి ఖర్చు పెట్టారు అని కన్నడ మీడియా వార్తలు వ్రాస్తోంది. 

మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈపెళ్ళి శుభలేఖలను శివరాజ్ కుమార్ వీరాభిమానులు కొంతమంది వద్ద 10 వేల నుంచి 20 వేల వరకు ఖరీదు పెట్టి బ్లాక్ లో కొన్నారు అని కన్నడ మీడియాలో వస్తున్న వార్తలు బట్టి ఈ పెళ్ళి బెంగుళూరులో ఎంత హాట్ టాపిక్ గా మారిందో అర్ధం అవుతుంది. భవిష్యత్ లో ఇలాంటి పెళ్ళిళ్ళు మన టాలీవుడ్ లో కూడ మొదలు పెడతారేమో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: