గతవారం ‘బ్రూస్ లీ’ ఫస్ట్ లుక్ తో తన అభిమానులకు కిక్ ఇచ్చిన రామ్ చరణ్ వారం రోజులు గడవకుండానే తన లుక్ ను మార్చి నిన్న బెంగుళూరులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కుమార్తె పెళ్ళిలో అయ్యప్పమాలతో కనిపించడం రామ్ చరణ్ అభిమానులకు షాకింగ్ గా మారింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఊహించని ట్విస్ట్ కు అర్ధం ఏమిటో తెలియక చరణ్ అభిమానులు అయోమయంలో పడిపోయినట్లు టాక్. 

చెర్రీకి భక్తి ఎక్కువ అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ యంగ్ హీరోలలో భగవంతుడిని నమ్మేలిస్ట్ లో చరణ్ టాప్ ప్లేస్ లో ఉంటాడు. ప్రతి సంవత్సరం స్వామి అయ్యప్ప మాలను వేసుకుని దీక్ష చేపట్టడమే కాకుండా క్రమంతప్పకుండా అయ్యప్ప దర్శనం చేసుకుంటూ ఉంటాడు. 

అయితే ప్రతి సంవత్సరం చరణ్ షూటింగుల్లేక ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా అయ్యప్ప మాలను ధరిస్తుంటాడు. కానీ ఈసారి మాత్రం చెర్రీ తన పద్ధతి మార్చి అందరికీ షాక్ ఇచ్చాడు. ఒక వైపు ‘బ్రూస్ లీ’ సినిమా సెట్స్ లో ఉండగానే చరణ్  సడన్ గా అయ్యప్ప మాల ధరించి భక్తుడుగామారిపోయాడు. ఇంతవరకు అన్ని బాగానే కనిపిస్తున్న ‘బ్రూస్ లీ’ సినిమాకు సంబంధించిన షూటింగ్ పెండింగ్ లో ఉన్ననేపధ్యంతో పాటు చరణ్ రకుల్ ప్రీత్ లపై తీయవలిసిన పాటల షూటింగ్ పెండింగ్ లో ఉంది.

ఈ పరిస్థితులలో అయ్యప్ప మాల అంటే కనీసం 40 రోజులు ధీక్షచేయవలిసి ఉండగా చరణ్ రొమాంటిక్ సాంగ్స్ లో ఎలా నటిస్తాడు అంటూ చరణ్ అభిమానులు అనుమానాలు వ్యక్త పరుస్తున్నారు. అయితే ఈ దీక్ష అయ్యేవరకు చరణ్ ‘బ్రూస్ లీ’ షూటింగ్ కు దూరంగా ఉంటే ఈసినిమాను దసరాకు ఎలా విడుదల చేస్తారు అని చరణ్ అభిమానులు మధన పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు చరణ్ లేటెస్ట్ లుక్ ‘బ్రూస్ లీ’ విడుదల వాయిదా పడుతుంది అన్న వార్తలకు బలాన్ని ఇస్తోంది. దీనిని బట్టి చూస్తూ ఉంటే చరణ్ ‘బ్రూస్ లీ’ డిసెంబర్ లేదా జనవరి వరకు వాయిదా పడినా ఆశ్చర్యం లేదు అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: