మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. వారసత్వపు హీరోలుగా వస్తున్నప్పటికీ చిరంజీవి ఇమేజ్ ఎక్కడా పడకుండా జాగ్రత్త పడుతున్నారు మెగా హీరోలు.. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాన్, తనయుడు రాంచరణ్, అల్లుళ్లు అల్లు అర్జున్, సాయిధర్మతేజ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమ సొంత టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.


ఇదే బాటలో వస్తున్న వరుణ్ తేజ్..  క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘కంచె’ చిత్రం ఇప్పటికే ఫస్ట్ లుక్..టీజర్ వచ్చాయి ఇందులో వరుణ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.  బ్రిటీష్ వారికి, జమీందార్ వ్యవస్దకు వ్యతిరేకంగా సాగే పోరాటంతో ఈ చిత్రం కథ సాగనుంది. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ..సైనికుడుగా కనిపిస్తాడని తెలుస్తోంది. 1910 వ సంవత్సరంలో కథ జరుగుతుంది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. తొలి సినిమాతోనే మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. 


కంచె చిత్రం పోస్టర్


ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్నైమెంట్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరంతాన్ భట్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో కంచె సినిమాను తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం థియేటర్ ట్రైలర్ ని రాజమౌళి ఈ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విడుదల చేసారు. హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: