టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్క రాంగోపాల్ వర్మ చిక్కుల్లో పడ్డాడు.. తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు తీస్తూ ఫామ్ లో ఉండగానే రాంగోపాల్ వర్మ బాలీవుడ్ పయనమయ్యారు. అక్కడ కొన్ని హిట్, ఫ్లాపు సినిమాలు తీస్తు అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా రాంగోపాల్ వర్మకు రాంగోపాల్‌వర్మకు ఢిల్లీకోర్టు రూ.10లక్షల జరిమానా విధించింది.

 1975 బ్లాక్ బ్లస్టర్ సినిమా ‘షోలే’  కాపీరైట్ హక్కులను ఉద్ధేశ్యపూర్వకంగా అతిక్రమించారని వర్మతోపాటు ఆయన ప్రొడక్షన్ కంపెనీపైన షోలే నిర్మాత కుమారుడు విజయ్‌సిప్పి, మనవడు జీపీ సిప్పీ కోర్టును ఆశ్రయించారు.  అమితాబచ్చన్, ధర్మేంద్ర నటించిన షోలే సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అసలు ఆ ఇద్దరు హీరోల కెరీర్ మలుపు తిప్పిన చిత్రం అది..ఇక గబ్బర్ సింగ్ గా అజ్మద్‌ ఖాన్‌ బాగా పాపులర్ అయ్యారు.  ఇక ఈ షోలే సినిమా రాంగోపాల్ వర్మ ’ ఆగ్’ పేరుతో వర్మ రీమేక్ చేశాడు. షోలే మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న కాపీరైట్ హక్కులను రాంగోపాల్ వర్మ కీ షోలే పేరుతో ఉల్లంఘనకు పాల్పడినందుకు కోర్టు వర్మకు జరిమానాను విధించింది.

షోలే పాత చిత్రం, రాంగోపాల్ వర్మ ఆగ్ చిత్రాం పోస్టర్


షోలే అసలు సినిమా నిర్మాతల మనవడు సస్ఛా షిప్పీ కాపీరైట్ చట్టం కింద వర్మపై నమోదు చేసిన కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. షోలే నిర్మాతల అనుమతి తీసుకోకుండా సినిమాలో సన్నివేశాలు, పాత్రలు, నేపథ్య సంగీతాన్ని వాడుకున్నందుకు కోర్టు ఈ తీర్పు చెప్పింది. 2007 ఆగస్టు 31న ఆగ్ సినిమా రిలీజ్ చేశారు. 2015 సంవత్సరం అదే రోజున ఆ సినిమాపై కాపీరైట్ తీర్పు రావడం గమనార్హం.  



మరింత సమాచారం తెలుసుకోండి: