తెలుగు ఇండస్ట్రీలో బాలనటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యి అంచెలంచెలుగా పైకి వచ్చి స్టార్ కమెడియన్ గా ఎదిగిన అలి ఈ మద్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హీరోయిన్లతో..యాంకర్లతో చెడా మడా తిట్టించుకుంటున్నాడు.   కమెడియన్ అలీ కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారుతున్నడు. కాట్రవల్లీ కామెడీతో ప్రతి ఒకరిని కడుపుబ్బా నవ్వించే అలీ నోటి నుండి, ఈ మధ్య కాలంలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

తను చేస్తున్న కామెడీ షోలలో సైతం, సందర్భం వచ్చినప్పుడల్లా తన నోటి నుండి డబుల్ మీనింగ్ తూటని వదులుతున్నాడు. సినిమాల్లో కామెడీ వేషాలు వేస్తూనే ఈ మద్య బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ బిజీ అయ్యాడు అలీ. అంతే కాదు సినిమా ఆడియో ఫంక్షన్లో..అవార్డు ఫంక్షన్లో యాంకరింగ్ చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు.. అలీ తెలియక చేస్తాడో..తెలిసి చేస్తాడో కానీ హీరోయిన్ల విషయంలో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఆట పట్టిస్తుంటారు.. ఆ సమయంలో వారు లోలోపల నొచ్చుకున్న అది కుళ్లు జోకు కింద భావిస్తూ నవ్వేస్తున్నారు. కానీ కొంత మందికి ఈ జోకులు ఎబ్బెట్టుగా అసహ్యంగా ఉంటాయి.. మా అవార్డు ఫంక్షన్లో రాశీ ఖన్నా వేసుకున్న డ్రెస్ పై కామెంట్ చేశాడు... నీ డ్రెస్సు చాలా బాగుందనీ స్వచ్ఛ భారత్ కు నీ వంతు కృషి చేస్తున్నావని హాల్ మొత్త శుభ్రమైందని కామెంట్ చేశాడు.. వాస్తవానికి రాశీఖన్నా ఆ రోజు పెద్ద గౌన్ వేసుకొని వచ్చింది.

కమీడియన్ అలీ


అలీ చేసిన కామెంట్లు తనకు అర్థం కాక అదేదో పెద్ద జోక్ అని నవ్వేసింది.. కానీ అర్ధమైన వారు మటుకు అలీని తిట్టుకున్నారు. ఇక రకూల్ ప్రతిసింగ్ అవార్డు తీసుకున్న సందర్భంగా అలీ మరో జోక్ పేల్చాడు.. రకూల్ సింగ్ చిన్న కొచ్చెన్ చేయాలీ అంటూ ‘కోసి కారం పెడతా’ అన్నావ్ ఆ ఐటమ్ ఏంటమ్మా..? అంటూ ప్రశ్నించాడు. అది ఏ ఐటమ్ అని మా వాళ్లు అడుగుతున్నారని  .. కోసి కారం పెడతా  అంటే ఎక్కడ పెడతారు అని అడుగుతున్నారంటూ ఆటపట్టించాడు.. దీంతో పక్కన ఉన్న కల్పించుకొని అలీకి గొడ్డు కారం కావాలట.. అనగానే రకూల్ ప్రితిసింగ్ ఈ సారి మీకు గుంటూరు కారం పెట్టమని డైరెక్టర్ కి చెబుతా అంటూ అక్కడనుంచి వెళ్లిపోయింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: