తెలుగు సినిమా కి టెక్నాలజీ పరంగా కొత్త హంగులు దిద్దిన దర్శక ధీర ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో రూపు దిద్దుకున్న  చిత్రం బాహుబలి. తెలుగు చలన చిత్ర సీమలో ఇప్పటి వరకు చేయని ప్రయోగాలు..ఏ సినిమాకు పెట్టని ఖర్చు..దాదాపు రెండున్న సంవత్సరాలు కష్టపడి తీసిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన ఈ చిత్రానికి అనుకున్న స్థాయికంటే ఎక్కువ రిజల్ట్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో 4000 థియేటర్లో ఈ చిత్రాన్ని ప్రదర్శంచి రికార్డు మోతలు మోగించారు. ఇప్పటి వరకు భారత చలన చిత్ర చరిత్రలో  రూ.550 కోట్ల కలెక్షన్స్ చేసి అటు తమిళ  ఇటు హిందీ భాషల్లో అప్పటి వరకు ఉన్న రికార్డులు బద్దలు కొట్టేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అలరిస్తున్న ఈ చిత్రం పాకిస్తాన్ లో విడుదల అయ్యింది. సాధారణంగా బాలీవుడ్ సినిమాలే పాకిస్తాన్ లో విడుదల కావడం చూస్తున్నాం.

బాహుబలి పోస్టర్


ఇప్పుడు టాలీవుడ్ మూవీ బాహుబలి కూడా పాకిస్తాన్ లో రిలీజై మంచి కలెక్షన్లే రాబట్టడం విశేషం. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసిన బాహుబలి ఇప్పుడు పాకిస్తాన్ లోనూ మంచి వసూళ్లే రాబట్టిందని టాక్.హిందీలోకి డబ్ చేసి ఈ సినిమాను పాకిస్తాన్ లో విడుదల చేశారు. త్వరలోనే కొరియాలో జరిగే బూసాన్ ఫిలిం ఫెస్ట్ లోనూ బాహుబలిని ప్రదర్శించనున్నారని సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: