ఈనెల17న రాబోతున్న వినాయకచవితి నందమూరి ఫ్యాన్స్ డబుల్ జోష్ గా మారబోతోంది. ప్రస్తుతం జూనియర్ బాలయ్యల మధ్య గ్యాప్ ఏర్పడటంతో వీరిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దీనితో ప్రస్తుతం నందమూరి అభిమానులు బాలకృష్ణ జూనియర్ అభిమానులుగా రెండు వర్గాలుగా చీలిపోయారు. 

దీనివల్ల జూనియర్ సినిమాల ఓపెనింగ్స్ కు  కొంత నష్టం జరుగుతోంది అన్న కామెంట్స్ ఇప్పటికే వచ్చాయి. ఈ పరిస్థితులు ఇలా ఉండగా మరికొద్ది రోజులలో రాబోతున్న వినాయక చవితికి బాలయ్య ‘డిక్టేటర్’, ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ టీజర్స్ రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. 

యూరప్ లో ఈ రెండు సినిమాల షూటింగుషెడ్యూల్స్ శరవేగంగా జరుగుతున్నాయి. బల్గేరియాలో 'డిక్టేటర్' యూనిట్ లండన్ లో ‘నాన్నకు’ యూనిట్స్ బిజీబిజీగా తమ పనులు పూర్తి చేసు కుంటున్నాయి. వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఈ రెండు సినిమాలు రాబోతున్న సంక్రాంతి రేస్ కు రెడీ అవుతున్నాయి అన్న సంకేతాలు ఇప్పటికే వచ్చాయి. 

ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఈరెండు సినిమాల టీజర్ లు ఒకేరోజు విడుదల అవుతాయి అని వార్తలు రావడం ఇప్పుడు షాకింగ్ న్యూస్ గా మారింది. బయటకు వస్తున్న ఈవార్తలు నిజం అయితే వినాయక చవితి రోజున నందమూరి వార్ చూడబోతున్నాం అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: