నిన్న వరుణ్ తేజ్ ‘కంచె’ ట్రైలర్ విడుదల సందర్భంగా దర్శకుడు రాజమౌళి మెగా కుటుంబంలోని హీరోల పై చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరిచాయి. ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చి హీరోగా మారడం ఒక వరం అయిన నేటి పరిస్థుతులలో మెగా కుటుంబం నుంచి హీరోగా రావడం వరమే కాదు శాపంగా కూడ మారుతోందని షాకింగ్ కామెంట్స్ చేసాడు రాజమౌళి. 

దీనికి కారణం మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోల పై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగి పోతున్నాయని అందువల్ల ఆ అంచనాలకు తగ్గట్టుగా హీరో వరుణ్ తేజ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకోవాలని అప్పుడే ఈ తీవ్రమైన పోటీలో వరుణ్ తేజ్ నిలబడగాలుగుతాడు అని కామెంట్ చేసాడు రాజమౌళి. 

ప్రస్తుత పరిస్థుతులలో ఒక సినిమాను తీసి జనాలను మెప్పించాలి అంటే ఎంత కష్టమో తనకు తెలుసు అని అటువంటి తపనా అంకితభావం ఉన్న దర్శకుడు క్రిష్ రెండవ ప్రపంచ యుద్ధం నాటి సన్నివేశాలను, ఆనాటి పరిస్తుతులను నేటి తరం ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చి దిద్దాలి అంటే అది సామాన్యమైన విషయం కాదు అంటూ క్రిష్ ను పొగడ్తలతో ముంచెత్తి వేసాడు రాజమౌళి. ఇప్పటి వరకు క్రిష్ తీసిన సినిమాలకు వాణిజ్య పరంగా పెద్ద విజయాలు రాకపోయినా ఆలోటును ‘కంచె’ తీరుస్తుంది అన్న నమ్మకాన్ని వ్యక్తపరిచాడు జక్కన్న.

రెండవ ప్రపంచ యుద్ద నేపధ్యంలో తీసిన సినిమాలు తెలుగు తమిళ భాషలలో ఇప్పటి వరకు రాలేదు. అటువంటి కథతో సాహసం చేయడమే కాకుండా అటువంటి సినిమాకు క్రేజ్ తీసుకు రావడం చాల కష్టం. అయితే నిన్న విడుదలైన ‘కంచె’ టీజర్ తో ఈసినిమా క్రేజ్ మరింత పెరిగిపోవడంతో వరుణ్ తేజ్ కు మంచి రోజులు వస్తున్నాయి అని అంటున్నారు. మరి ఈ సినిమా వరుణ్ కెరియర్ కు ఎటువంటి ట్విస్ట్ ను ఇస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: