తెలుగు సినిమా  ఇండస్ట్రీలోకి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ తో వెండి తెరకు పరిచయం అయ్యారు పవన్ కళ్యాన్. తర్వాత వచ్చిన సినిమాలు అంత పెద్ద హిట్ కాలేకపోయినా తొలిప్రేమ,సుస్వాగతం,తమ్ముడు లాంటి సినిమాలు పవన్ లోని నటన బయటపెట్టాయి. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తీసిన సినిమా జల్సా, అత్తారింటికి దారేది బ్లాక్ బ్లస్టర్ గా నిలిచి పోయాయి. గబ్బర్ సింగ్ సినిమా రికార్డుల మోత మోగించింది.

ఈ రోజు పవన్ కళ్యాన్ పుట్టిన రోజు.. వాస్తవానికి ఈ పుట్టిన రోజు వేడుకలకు పవన్ కాస్త దూరంగానే ఉన్నారు. హంగూ,ఆర్భాటాలకు వెళ్లని పవన్ ప్రజలకు ఉపయోగ పడే ఏ పనైనా చేయాలని తన అభిమానులను కోరారు.  ఇక సినిమా ఇండస్ట్రీలో పవన్ అంటే అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. ఈ నేపధ్యంలో పవన్ మిత్రుడు,అభిమాని అయిన కోన వెంకట్ ఓ పాటను రాసి తను రచన చేస్తున్న ‘శంకరాభరణం' టీమ్ తరుపున విడుదల చేసారు. ఆ పాటను మీరు ఇక్కడ చూడండి. అంతేకాకుండా పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘శంకరాభరణం' టీమ్ ఓ పోస్టర్ ని సైతం విడుదల చేసింది. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు. 


నటుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ 


ఇక శంకరాభరణం సినిమా విషయానికి వస్తే ఇది అనాటి శంకరాభరణం అస్సలు పోలిక ఉండదని.. కాకపోతే ఆ టైటిల్ పెట్టామని అన్నారు. బీహార్ నేపధ్యంలో క్రైమ్ ప్రధానంగా సాగే థ్రిల్లర్. ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం అనే అతను దర్శకుడుగా పరిచయం అవ్వనున్నారు. అలాగే ప్రవీణ్ లక్కిరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఇంతకుముందు కోన వెంకట్..అంజలి ప్రధాన పాత్రలో గీతాంజలి అనే హర్రర్ కామెడీని నిర్మించి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అన్ని రకాల ఎలిమెంట్ లతో డిఫెరెంట్ గా సాగుతుందని చెప్తున్నారు. 

గోపి మోహన్ ట్విట్స్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: