పవర్ స్టార్ పుట్టిన పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ రిలీజ్ చేసి మెగా అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్...అయితే బాబాయ్ బర్త్ డే కు తాను కూడా టీజర్ తో విష్ చేయడానికి వచ్చాడు రామ్ చరణ్. పవర్ స్టార్ కు బర్త్ డే విషెస్ చెప్పేందుకు బ్రూస్ లీ సెకండ్ టీజర్ లాంఛ్ చేశారు ఆ చిత్ర యూనిట్. అయితే మొదటి టీజర్లో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో మెస్మరైజ్ చేస్తే.. ఇప్పుడు వదిలిన రెండో టీజర్ మాత్రం ఫ్యామిలీ ఎమోషన్స్ ఇంకా రొమాన్స్ ని చూపించాడు శ్రీనువైట్ల.

 

బ్రూస్ లీ అనే టైటిల్ పెట్టాడు కాబట్టి కేవలం ఫైట్లే మాత్రం ఉంటాయనుకునే భావనలో ఉన్న వారికి ఈ టీజర్ తో సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉందని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. ఈ సెకండ్ టీజర్ తో చెర్రి ఫ్యామిలీ ఆడియెన్స్ దగ్గరకు కూడా చేరువవ్వడం విశేషం. తన ఫ్యామిలీకి చెర్రీని రకుల్ పరిచయం చేసే సీన్ తో మొదలుపెట్టి.. దాదాపు ట్రైలర్ అంతా ఫ్యామిలీ రిలేషన్స్ తోటే నింపారు. ముఖ్యంగా రకుల్ చరణ్ ల మధ్య రొమాన్స్ అదిరిపోయేలా ఉంది బ్రూస్ లీ సినిమాలో.

 

మాస్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న రామ్ చరణ్... క్లాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకే ఆలోచనతో ఒక ప్రయత్నంగా గోవిందుడు అందరివాడే మూవీ చేసినా అంతగా ఉపయోగ పడలేదు కాని ఈ సినిమాతో తప్పకుండా అది జరిగేలా ఉంది. 

 

ఇక ఈ సినిమాలో ఇంకో హైలెట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి దాదాపు 15 నిమిషాల పాటు చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం సో ఇన్ని హంగులూ ఉన్న ఈ సినిమా మెగా ఫ్యామిలీలో మరో రికార్డులు నెలకొలిపే సినిమాగా చరిత్ర సృష్టిస్తుందని అభిమానులంతా ఆశిస్తున్నారు.  ఈ టీజర్ గురించి సాయి ధరం తేజ కూడా.. బావ ఏమంటున్నాడంటే.. 'అబ్బాయికి బాబాయ్ మీద ఉన్న ప్రేమ ఈ ఒక్క టీజర్ తో బయటపడింది' అని చెప్పుకొచ్చాడు అది మ్యాటర్.


మరింత సమాచారం తెలుసుకోండి: