ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఈవెంట్స్ సందర్భంగా  సినిమాలకు సంబంధించిన  లోగో లాంచ్, ఫస్ట్ లుక్,సినిమా కు సంబంధించి టీజర్ లాంటివి రిలీజ్ చేస్తూ అటు వారికి గిఫ్టుగాను అభిమానులకు ఆనందంగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు దర్శక, నిర్మాతలు.. ఆ మద్య సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా..మహేష్ తండ్రి కోసం ‘బ్రహ్మోత్సవం’ లోగో ఆవిష్కరించారు.

ఈ మద్య చిరంజీవి పుట్టిన రోజు  గిఫ్ట్ గా రాంచరణ్ ‘బ్రూస్ లీ’ ఫస్ట్ లుక్..టీజర్ విడుదల చేశాడు...ఇక నాగార్జున తనయుడు అఖిల్ తన మూవీకి సంబంధించి టీజర్..ఫస్ట్ లుక్ విడుదల చేశాడు..ఇలా సెలబ్రెటీల పుట్టిన రోజు కానుకలు మూడు ఫస్ట్ లుక్కులు.. ఆరు టీజర్లుగా వెలిగిపోతున్నాయి. తాజాగా పవన్ కళ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా రాంచరణ్ ‘బ్రూస్ లీ’ టీజర్ ఒకటి విడుదల చేశాడు.  

బ్రూస్ లీ లో ఓ దృశ్యం


పవన్‌ పుట్టిన రోజున సెంటిమెంట్‌తో కూడిన టీజర్ రిలీజ్ చేశాడు.పవన్ కళ్యాణ్‌  పుట్టిన రోజు సందర్భంగా సర్దార్‌ గబ్బర్‌సింగ్ టీజర్‌ను రిలీజ్‌ చేసింది సర్ధార్‌ టీం.దీంతో పాటు అభిమానులకు చరణ్‌ బ్రూస్‌లీ ది ఫైటర్‌ మూవీ టీజర్‌ కూడా రిలీజ్ చేయడంతో మెగా,పవర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.రిలీజ్‌ అయిన కొద్ది నిమిషాలలోనే రెండు ట్రైలర్స్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: