హాలీవుడ్ లో తన అందచందాలతో..అద్భుతమైన నటనతో హాట్ హాట్ గా కనిపిస్తూ అందరినీ ఇట్టే కట్టిపడేసే హీరోయిన్ అంజలీనా జోలి.. ఈ అమ్మడు  ఇప్పుడు నలభైలో పడనుంది.. కానీ ఆమె అందం ఇప్పటికీ చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది.  అంజలీనా జోలి హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎన్నోవివాదాస్పద వార్తలు వస్తూనే ఉన్నాయి.  ఈ అమ్మడు  నటులు జానీ లీ మిల్లెర్ మరియు బిల్లీ బాబ్ తోర్న్టన్ నుండి విడాకులు తీసకుంది..,  ప్రస్తుతం నటుడు బ్రాడ్ పిట్ తో నివసిస్తున్నారు.

జోలీ మరియు పిట్  ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. అంతే కాదు అంజలీనా జోలి సమాజ సేవలో ఎప్పుడూ ముందు ఉంటుంది. గతంలో  బ్రిటెన్ రాణి ప్రిన్సెస్ డయానా మైన్ క్లియరింగ్ చారిటీ ఈమె సభ్యురాలిగా ఉండేది. కానీ ఈ సంస్థ నుంచి ఆమె తప్పుకుంది. ఇప్పుడు  అంజలీనా జోలి  మళ్లీ  వార్తల్లోకి ఎక్కింది.. అమె మంచి యవ్వనంగా వున్నప్పుడు దిగిన అరుదైన ఫోటోలు కూడా ఇప్పడు భలేగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. అయితే అవి ఏంజిలినా అరుదైన న్యూడ్ చిత్రాలు.

బ్రాడ్ పిట్,అంజలీనా జోలి


లండన్లో స్థానిక జీబ్రా వన్ గ్యాలరీలో విక్రయానికి పెట్టగా ఒక్కో ఫోటో 1800 పాండ్లు. అంటే మన భారత దేశం కరెన్సీ ప్రకారం లక్షా 85 వేల రూపాయలు పెట్టి ఖరీదు చేస్తున్నారు అస్తున్నారు. 1995 వ సంవత్సరంలో  ఈ ఫోటోలు అప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో దిగినవే.. అయినా ఆమె క్రేజ్ కి ఫిదా అయిన వారు  రూ. 1,82,000 ధర పెట్టి పోటీలు పడీ మరీ కొంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: