మెగా అభిమానులు ఎంతగానో అభిమానించే పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘అత్తారింటికి దారేది’ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘పవర్ ’ దర్శకుడు బాబీతో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా తీస్తున్నాడు.. ఈ చిత్ర షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. అయితే పవన్ అభిమానులకు ఆశ్చర్య పరుస్తూ ఆగస్టు 15 కి సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్.. ఫస్ట్ లుక్ అదిరిపోయింది.. సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది.

తాజాగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ నిన్న అర్థరాత్రి విడుదలై యూట్యూబ్ రికార్డులను షేక్ చేస్తుంది.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్2) సంధర్భంగా విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది.  నార్తన్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. అసలే పవన్ అంటే పిచ్చిగా అభిమానంచే ఆయన అభిమానులు ఇక పుట్టిన రోజునే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న తమ అభిమాన నటుడి టీజర్ చూస్తే సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

 ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో పవన్ కళ్యాన్

Sardaar Gabbar Singh Latest Poster

ఈ ట్రైలర్ విడుదలైన 12 గంటలలోపే భారీగా పాపులర్ అయ్యింది. ఈ సమయంలోనే ఈ ట్రైలర్ ను 205747 మంది వీక్షించారు. అంతే కాకుండా ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లోపే సోషల్ మీడియాలో ఈ ట్రైలర్ భారీ ఎత్తున షేర్ చేసారు అభిమానులు. ‘పవర్’ దర్శకులు బాబీ దర్శకత్వం వహిస్తుండగా.. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది.  దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: