ఒక సినిమా వచ్చిందంటే దానికి సంబంధించి తగిన రెస్పాన్స్ ఇచ్చే ఆనవాయితి తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటినుండో వస్తుంది. అయితే ఈ మధ్య అది కాస్త ఇంకా ఎక్కువైంది రీసెంట్ గా అన్ని సినిమాల గురించి అందరు చాలా పాజిటివ్ గా ప్రమోట్ చేయడం మంచి విషయం. ఇక క్రిష్ తెరకెక్కిస్తున్న కంచె సినిమా గురించైతే తెలుగు పరిశ్రమలో చాలా మంది తమ అభిప్రాయాల్ని తెలియచేసారు . స్టార్ హీరో మహేష్ బాబు నుండి స్టార్ డైరక్టర్ రాజమౌళి వరకు ఈ సినిమా గురించి రెస్పాండ్ అయ్యారు. ఇంకా చాలామంది కంచె టీజర్ గురించి మెచ్చుకున్నారు.

వరుణ్ తేజ్ గురించి కూడా అందరు మెచ్చుకుంటూ ట్విట్ చేస్తున్నారు. కంచె సినిమా గురించి ఎవరెవరు ఏమన్నారంటే

 ‘‘చాలా బాగుంది. ఈ సినిమా తీయడానికి ఎంత పరిశోధన ఇంకా కష్టం అవసరమో అంచనా వేయగలను.కంచె టీంకి ఆల్ ద బెస్ట్’’

-రాజమౌళి


‘‘కంచె ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. మొత్తం టీంకి ఆల్ ద బెస్ట్’’

-మహేష్ బాబు

 

‘‘నా ఫ్రెండ్ క్రిష్ నా కజిన్ వరుణ్ తేజ్ కలిసి కొత్త తరం తెలుగు సినిమా అందిస్తున్నారు. ట్రైలర్ నాకు నచ్చింది. మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నా’’

-అల్లు అర్జున్

 

‘‘ఒకే తరహా సినిమాల నుంచి బయటపడి తెలుగు సినిమా ఎదుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ క్రిష్ హీరో వరుణ్ లకు కంగ్రాట్స్’’

-రామ్ గోపాల్ వర్మ

 

‘‘కంచె ట్రైలర్ నాకు భలే నచ్చింది. వరుణ్ తేజ్ స్టన్నింగ్ క్రిష్ కు కంగ్రాచులేషన్స్’’

-సాయిధరమ్ తేజ్

 

‘‘కంచె ట్రైలర్ చూసి పడిపోయా. క్రిష్ నుంచి మరో ల్యాండ్ మార్క్ ఫిలిం. నిన్ను చూసి గర్విస్తున్నా మచ్చా’’

-అల్లరి నరేష్

 

‘‘అక్టోబరు 2 వరకు ఆగలేకున్నా. వార్ అండ్ లవ్. పర్ఫెక్ట్ సెటప్’’

-మంచు లక్ష్మి

 

‘‘డైరెక్టర్ క్రిష్ తనదైన శైలిలో యునీక్ ట్రేడ్ మార్క్ సినిమాతో వస్తున్నాడు’’

-తాప్సి

 

‘‘మైండ్ బ్లోయింగ్ అంటే ఇదేనన్నమాట. క్రిష్.. నమ్మశక్యంగా లేదు. వరుణ్ తేజ్ టెర్రిఫిక్ గా ఉన్నాడు’’

-దేవిశ్రీ ప్రసాద్

 

‘‘హాలీవుడ్ రేంజిలో ఉంది కంచె ట్రైలర్. క్రిష్.. నువ్వు సాధించావ్. వరుణ్ తేజ్ టూ హాట్. అతణ్ని హ్యాండిల్ చేయడం కష్టం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా’’

-ఛార్మి

 

‘‘క్రిష్ సినిమా కంచె ట్రైలర్ చూశాక ఒకే ఒక్క మాట చెప్పగలను.. స్టన్నింగ్’’

-తరణ్ ఆదర్శ్ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్


మరింత సమాచారం తెలుసుకోండి: