యంగ్ టైగర్ ఎన్టీఆర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మూవీకి నాన్నకు ప్రేమతో అని ఫిక్స్ అయినట్టే అనుకున్నాం. కాని తెలుస్తున్నవార్తల ప్రకారం సినిమా టైటిల్ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదట. సినిమా కథకు తగ్గట్టుగా అయితే నాన్నకు ప్రేమతో అనేదే యాప్ట్ అవుతుంది. మొన్నామధ్య దండయాత్ర అని వినబడ్డా కాదు కాదు మొదట అనుకున్న నాన్నకు ప్రేమతోనే ఫైనల్ అని అన్నారు. అయితే సినిమా నిర్మాత అయిన బి.వి.ఎస్.ఎన్ ప్రసా ద్ రీసెంట్ గా అభిరామ్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాడట. ఇంతకీ ప్రసాద్ దేనికి అభిరామ్ టైటిల్ ని రిజిస్టర్ చేయించాడని అందరు డౌట్ పడుతున్నారు.

 

ఒకవేళ ఎన్టీఆర్ సినిమాకు మరళ టైటిల్ చేంజ్ చేసే ఆలోచన ఏమన్నా ఉన్నారా అనే డౌట్ కూడా కలుగుతుంది. అయితే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే అభిరామ్ అనే పేరు ఎందుకంటే ఎన్టీఆర్ తనయుడి పేరు అభయ్ రామ్. అంతేకాదు సుక్కు సినిమాలో ఎన్టీఆర్ క్యారక్టర్ పేరు కూడా అభిరామ్ అట. సో అందుకే టైటిల్ కూడా అభిరామ్ అని పెడతారని అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు.  

 

సుకుమార్ సినిమాలో ఎన్టీఆర్ :

 

ఇదవరకు ఎప్పుడు సుకుమార్ సినిమాల్లో ఇలా టైటిల్ గురించి ఇంత డిస్కషన్ జరగలేదు. మహేష్ బాబు 1 సినిమా అప్పుడు కూడా టైటిల్ కన్ ఫ్యూజ్ చేసినా 1 నేనొక్కడినే అనేది ఎనౌన్స్ చేసేశారు. ఇక ఎన్టీఆర్ విషయంలోనే ఎందుకో ఈ టైటిల్ కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ కన్ఫ్యూజన్ కి తెర దించేది ఇంకెన్నో రోజుల్లోనో  కాదు సెప్టెంబర్ 17న వినాయక చవితి సందర్భంగా యంగ్ టైగర్ తన సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయనున్నాడు.  

 

సో టీజర్లో టైటిల్ కన్ ఫ్యూజన్ ని కూడా పోగొడతారని ఆశిస్తున్నారు. టెంపర్ సినిమా తర్వాత దాదాపు 8 నెలలు గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ సుకుమార్ సినిమాను త్వరగా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ సంక్రాంతి బరిలో దిగాలనుకుంటున్నాడు. టెంపర్ ఫాంని కొనసాగిస్తూ ఎన్టీఆర్ ఈ సినిమాతో రికార్డులు తిరగరాసే హిట్ కొట్టాలని ఆశిద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: