కాంచనమాల కేబుల్ టీవితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నీళి కనులసుందరి లక్ష్మిరాయ్. కెరియర్ అంతగా ఆశించినంత సక్సెస్ ఫుల్ గా సాగకపోయినా దశాబ్ద కాలం నుండి ఇటు టాలీవుడ్లో, అటు కోలీవుడ్లో సినిమాలు చేసుకుంటూ వస్తుంది ఈ హాట్ గాళ్. అయితే సక్సెస్ రేట్ ని ఏమాత్రం పెంచుకోలేక పోయింది అమ్మడు. ప్రస్తుతం అరణ్మయి- 2 సినిమాలో నటిస్తున్న ఈ చిన్నది ఈరోజు పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ త్వరలో ఆయనతో షూటింగ్ చేయబోతున్నానని సేన్షేశనల్ న్యూస్ బయట పెట్టింది.

 

అమ్మడు పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటుందని తెలిసిందో అప్పటి నుండి ఇక అదే హాట్ టాపిక్ అయ్యింది. అయితే సర్ధార్ గబ్బర్ సింగ్ లో లక్ష్మిరాయ్  నటిస్తుందా.. నర్తిస్తుందా అన్నదాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికైతే అమ్మడికిది లక్కీ ఛాన్స్ అన్నట్టే.. పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే దానిలో కాస్త హాట్ హాట్ గా కనిపిస్తే చాలు ఆఫర్లు వాటంతట అవే వచ్చేస్తాయి.

 

లక్ష్మిరాయ్ హాట్ లుక్ :

 

ఈరోజు పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా వదిలిన టీజర్ కూడా ఫ్యాన్స్ ని బాగా అలరిస్తుంది. పవర్ సినిమాతో రవితేజకి మాంచి హిట్ ఇచ్చిన బాబి ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ గా డైరెక్ట్ చేస్తున్నాడు.కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న సర్ధార్ గబ్బర్ సింగ్ లో ఇప్పుడు హాట్ గాళ్ లక్ష్మి రాయ్ కూడా నటిస్తుందని తెలిసింది. పవర్ స్టార్ పవర్ ఫుల్ పాక్డ్ గా వచ్చిన గబ్బర్ సింగ్ ఎన్ని రికార్డులను సృస్టించిందో తెలిసిందే. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా అంతకంటే భారీ రేంజ్లో ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

 

మొత్తానికి పవర్ స్టార్ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది లక్ష్మి రాయ్. మరి అమ్మడు ఇదవరకులా కాకుండా వచ్చిన ఈ సదవకాశాన్ని వినియోగించుకుని స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోవాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: