పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీజర్ విడుదలై ఒకరోజు గడవకుండానే ఈసినిమా టీజర్ పై కొందరు చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ పవన్ అభిమానులను టార్చర్ పెడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ పుట్టిన రోజు వేడుకలు ప్రారంభం అయిన అర్ధరాత్రి 12 గంటలకు విడుదల అయిన ఈ టీజర్ విడుదలకు ముందు చాలా హడావిడి జరిగింది. 

ఈ సినిమా డైరెక్టర్ బాబి అయితే ఈటీజర్ ను చూసి తను తెగ ఎగ్జయిట్ అయిపోయాను అంటూ ట్విట్ చేసి దేవిశ్రీప్రసాద్ ఈటీజర్ కు అందించిన ఆర్ ఆర్ అదిరిపోయిందని ట్విట్  చేయడంతో ఏదో అద్భుతం ఉంటుందని  ఆశ పడ్డ చాలామందికి ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టీజర్ నిరాశ పరిచింది అంటూ కొంతమంది బహిరంగంగానే కామెంట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికికారణం ఇంతకుముందు ఈసినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో కనిపించిన గుర్రం, గబ్బర్ సింగ్ గెటప్ నే టీజర్ లో కూడ చూపెట్టారు కాని కొత్త విషయం ఏముంది  అని కొందరు కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. అంతేకాదు 30 సెకండ్ల ఈటీజర్ లో  స్లో మోషన్ లో పవన్ నడుచుకుంటూ రావడానికి 10 సెకండ్స్ వృథ అయిపోతే మరో 10 సెకండ్స్ గ్రాఫిక్స్ తో నింపేసారని పవన్ పై విమర్శకుల వాదన. మొత్తం మీద చూస్తే పవన్ ఈ టీజర్ లో కనిపించింది 10 సెకండ్స్ మాత్రమే కదా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నట్లు టాక్. 

అంతేకాకుండా ఈ టీజర్ వెనుక దేవిశ్రీప్రసాద్ ఉపయోగించిన ఇన్స్ట్రుమెంటేషన్ ఇప్పటికే అనేక సార్లు కౌబాయ్ సినిమాల ట్యూన్స్ ను గుర్తుకు చేస్తోంది అని విమర్శిస్తూ ఉండటంతో ఈ కామెంట్స్ పవన్ అభిమానులను ఖంగారు పుట్టిస్తున్నాయి అని టాక్. దీనితో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఈ టీజర్ ను ఎందుకు బయటకు తీసుకు వచ్చారు అని పవన్ అభిమానులు మధన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో విడుదలైన సీక్వెల్స్ సినిమాలు అన్నీ పరాజయం చెందిన నేపధ్యంలో సర్దార్ మొట్టమొదటి టీజర్ పైన ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ రావడం పవన్ అభిమానులకు షాకింగ్ గా మారింది అని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: