టాలీవుడ్ లో ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించిన చిట్టి నడుము సుందరి ఇలియానా, ఇప్పుడు సినిమా ఆఫర్లు లేక ఏం చేయాలో తోచని పరిస్థితి లో ఉందట. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి ఆ స్టార్స్ ఫ్యాన్స్ కి తన వాలు చూపులతో గిలిగింతలు పెట్టి సూపర్ హిట్లు కొట్టిది. పోకిరితో మొదలైన అమ్మడి తెలుగు సినీ ప్రస్థానం ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించింది.      


ఇక తెలుగులో అవకాశాలు సన్నగిల్లుతున్నాయ్ అనే విషయం తెలుసుకున్న ఇల్లీ బేబ్ సైలెంట్ గా బీ టౌన్ కి చెక్కేసింది. అక్కడ ఎంట్రీ ఇవ్వగానే బర్ఫి సినిమా ఆఫర్ కొట్టేసింది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు ముగ్దులైన బాలీవుడ్ ప్రేక్షకులు ఇల్లీ బెబ్ ని బాగానే ఆదరించారు. ఇక అలా ఆ సినిమా హిట్ ఇంకో రెండు మూడు బాలీవుడ్ సినిమాలను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాల్లో నటించిన ఇలియానా బీ టౌన్ ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేసింది.


ఇలియానా హాట్ ఫోటో షూట్ :


ఇప్పుడు ఏం చేయాలో తోచని అమ్మడు యాడ్స్ చేసుకుంటూ కాలం గడిపేస్తుంది. సరే వచ్చిన ఆఫర్లు ఎందుకు కాదనాల్లే అని యాడ్స్ తీసేసుకుంటూ ఆ విధంగా కూడా సంపాధిస్తుంది. కాని రీసెంట్ గా అమ్మడు ఓ కండోం యాడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మొదట ఈ యాడ్ లో కాజల్ ని కోరగా ఆమె ముందు చేస్తా అన్నా, తర్వాత రెస్పాండ్ ఇవ్వలేదట అందుకే ఈ యాడ్ గోవా బ్యూటీ ముందుకు వచ్చి ఆగింది. మరీ కడోం యాడా.. అని ఆలోచించకుడా సరే అనేసిందట బెబీ. ఏం చేస్తాం సినిమాల్లేనప్పుడు వీటితోనైనా కాస్త ఆడియెన్స్ కి దగ్గరవుదామని ఇలియానా ఆలోచన. అన్నట్టు ఇంకో విషయమండోయ్ ఈ కండోం యాడ్ కి అమ్మడికి రెమ్యునరేషన్ కింద బాగానే ముట్టచెబుతున్నారంట యాడ్ కంపెనీ వారు. 


కొంతకాలంగా హాట్ న్యూస్ అయిన ఇలియానా కండోం యాడ్ అమ్మడు చేసిందా చేయలేదా అన్న దాని మీద క్లారిటీ రాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో ఐటం సాంగ్ కోసం నానా తిప్పలు పడుతుంది ఈ హాట్ బ్యూటి. మరి కండోం యాడ్ ఏమైందో అని అనుకుంటున్నారు ప్రేక్షకులంతా.


మరింత సమాచారం తెలుసుకోండి: