మోహన్ బాబు కుమారుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు తన డైనమిక్ మనస్తత్వంతో ఎటువంటి సవాల్ కు అయినా సిద్ధం అంటూ ఉంటాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, వ్యాపార వేత్తగా సామజిక కార్యకలాపాలు నిర్వహించే సెలిబ్రేటిగా ఎన్నో వ్యాపకాలలో బిజీగా ఉన్నా టాలీవుడ్ యంగ్ హీరోల రేస్ లో తాను కూడ ఉన్నాను అంటూ వరస పెట్టి సినిమాలు తీస్తూ టాప్ యంగ్ హీరోగా ఎదగడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

రేపు విడుదల అవుతున్న తన ‘డైనమైట్’ సినిమా ప్రమోషన్ కోసం ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలను ప్రభావితం చేస్తున్న సినిమా బడ్జెట్ సమస్య పై సంచలనాత్మక కామెంట్స్ చేసాడు. తన సినిమాలకు తన మార్కెట్ కు మించి ఎక్కువ ఖర్చు పెడతాడు అని తన పై వస్తున్న కామెంట్స్ గురించి స్పందిస్తూ తన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయవలసిన పరిస్థితి ఏర్పాడితే తాను సినిమాలు తీయడమే మానేస్తాను అని అంటూ తనలోని నటుడుని సంతృప్తి పరుచుకోవడానికి భవిష్యత్తులో తన గురించి గొప్పగా చెప్పుకోవడానికి తనకoటూ కొన్ని సినిమాలు ఉండాలి కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు విష్ణు.

రేపు విడుదల కాబోతున్న ‘డైనమైట్’ విజయం సాధిస్తుందని తనకు పరిపుర్ణమైన నమ్మకం ఉంది అంటూ ఈమధ్య కుటుంబ కథా చిత్రాల హడావిడి ఎక్కువగా జరుగుతున్న నేపధ్యంలో ఆ ట్రెండ్ ను కొద్దిగా మార్పు చేసే సినిమాగా ‘డైనమైట్’ ఉంటుందని అభిప్రాయపడుతూ ఆసినిమా టైటిల్ లోనే ఒక శక్తి ఉంది అంటూ ఆశ్చర్య పరిచే కామెంట్స్ చేసాడు విష్ణు.

ఇక తాను వచ్చేసంవత్సరం మొదట్లో ప్రారంభిమ్చాబోతున్న ‘కన్నప్ప’ సినిమాను అనుకున్న విధంగా తీయాలి అంటే 100 కోట్లబడ్జెట్ అవుతుంది కాబట్టి ఆ స్థాయిలో తీయడానికితాను హాలీవుడ్ సహకారం తీసుకుంటున్నాననే విషయాన్ని బయట పెట్టాడు విష్ణు. ఈసినిమాలో భక్తితో పాటు యాక్షన్ కు కూడ ప్రాధాన్యత ఉండేలా తనికెళ్ళ భరణి స్క్రిప్ట్ తయారు చేస్తున్నాడని వివరిస్తూ తాను ‘భక్తకన్నప్ప’ గా కనిపించడం ఖాయం అని అంటున్నాడు ఈ ‘డైనమైట్’. రేపు విడుదల అవుతున్న ఈసినిమా విష్ణు అంచనాలను ఎంతవరకు చేరుకుంటుందో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: